చాదర్‌ఘాట్, అక్టోబర్ 18: నిబంధనలకు విరుద్ధంగా రాత్రి దుకాణాలను తెరిచి వ్యాపారం కొనసాగిస్తున్న ముగ్గురికి, ఈవ్ టీజింగ్ చేస్తూ పట్టుబడిన ఒక యువకుడికి జైలు శిక్ష పడింది.
చాదర్‌ఘాట్ ఇన్స్పెక్టర్ ప్రకాశ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… సోహెల్ హోటల్ చిల్లా దగ్గరలో హబీబ్ టిఫీన్ సెంటర్‌ను నిర్వహిస్తున్న హబీబ్ ఉల్లా ఖాన్ (48)కు ఐదు రోజులు, రైల్వే స్టేషన్ దగ్గరలో జ్యూస్ సెంటర్‌ను నిర్వహిస్తున్న అహ్మద్ బిన్ అబ్దుల్లాకు మూడు రోజులు, నయాగ్రా హోటల్ పాన్‌షాపును నిర్వహిస్తున్న మహ్మద్ అంజాద్ అలీకి మూడు రోజులు, ఈవ్ టీజింగ్‌కు పాల్పడిన టి.గోపీకిషన్కు ఐదురోజుల జైలు శిక్ష పడినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.