KTR | ఫార్ములా ఈ రేస్ కేసు ముమ్మాటికీ ఒక లొట్టపీసు కేసేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్లో కేటీఆర్ మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలపై ప్రైవేట్ మెంబర్ బిల్లు నుండి ప్రజలను డైవర్ట్ చేసేందుకే ఫార్ములా ఈ రేస్ కేసు తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ఎక్కడా నిధుల దుర్వినియోగం జరగలేదు, లేని కేసు ఉన్నట్టుగా చూపి మసి పూసి మారేడు కాయ చేస్తున్నారని మండిపడ్డారు.
అది ముమ్మాటికి లొట్టపీసు కేసేనని, ఎక్కడా క్విడ్ ప్రో కో జరగలేదన్నారు కేటీఆర్. బ్యాంక్ టు బ్యాంక్ నగదు బదిలీ జరిగింది, డబ్బులు ఇంకా ఆ కంపెనీ దగ్గరే ఉన్నాయి, ఛార్జ్ షీట్లో ఆ కంపెనీ పేరు ఎందుకు లేదు..? అని కేటీఆర్ ప్రశ్నించారు.
మేము నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ వల్ల రూ.700 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. రేవంత్ రెడ్డి రూ.200 కోట్లు ఖర్చు చేసి మిస్ వరల్డ్ పోటీలు పెడితే, ప్రపంచం ముందు మన తెలంగాణ పరువు పోయిందన్నారు. నన్ను వేశ్య లాగా చూశారని మిల్లా మ్యాగీ ఇంటర్వ్యూలో చెబితే, దాని మీద ఎలాంటి విచారణ లేదన్నారు. అక్రమ కేసులకు మేము భయపడము, న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం, మాకు న్యాయం జరుగుతుంది. అన్నీ నా నిర్ణయాల ప్రకారమే జరిగాయని చెప్తున్నాను కదా, అధికారులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కేటీఆర్.
Lokesh Kanagaraj | లోకేష్ కనగరాజ్ షూటింగ్ వాహనంలో AK-47లు.. తనిఖీల్లో అధికారులకు షాక్!
Vijayawada | విజయవాడలో టెర్రర్ కలకలం.. ముగ్గురు యువకులను ఉగ్రవాదంవైపు నెట్టిన హైదరాబాద్ యువతి!
వికారాబాద్ జిల్లాలో సర్పంచ్ ఇంటికి నిప్పంటించిన దుండగుడు.. పలువురికి తీవ్ర గాయాలు