హైదరాబాద్ : కుల్సుంపురా పోలీస్ స్టేషన్(Kulsumpura police station ) పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు(Murder) గురయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..గోపి హోటల్ సమీపంలో ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో గోపి అనే వ్యక్తి అనిల్ అనే మాజీ రౌడీ షీటర్(Former rowdy sheeter)ను కాల్చి చంపినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న ఏసీపీ జావేద్ క్లూస్ టీమ్ కలిసి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. పోలీసులు వివరాలు సేకరించి మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఒస్మానియా దవాఖానకు తరలించారు. గోపి అనే నిందితుని కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివారాలు తెలియాల్సి ఉంది.