సిటీబ్యూరో, మార్చి 29(నమస్తే తెలంగాణ) : ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ నూతన ప్రచారానికి శ్రీకారం చుట్టింది. రైస్ బ్రాన్ ఆయిల్ వినియోగం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై ఓ వీడియోను రూపొందించి మార్కెట్లోకి విడుదల చేశారు. సుప్రసిద్ధ న్యూట్రిషియనిస్ట్ డాక్టర్ మతీన్ అస్కార్ ఈ వీడియోలో తినాల్సిన సమతుల్య ఆహారం, చేయాల్సిన వ్యాయామాల ఆవశ్యకతతోపాటు ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ వంటి నూనెలను ప్రతిరోజూ వంటలో వినియోగించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. ఈ వీడియో ఇప్పటికే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై ఒక మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సాధించింది. ఈ సందర్భంగా ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పి.చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఫ్రీడమ్ ఆయిల్ నాలెడ్జ్ సిరీస్‌లో భాగంగా మేము వంట నూనెల ఆరోగ్య ప్రయోజనాలను వివరిస్తున్నామన్నారు. ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్లో 10,000+ పీపీఎం ఒరైజనాల్, టోకోఫెరాల్, టోకోట్రైనాల్స్ ఉన్నాయని తెలిపారు. ఇవి సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేయడంతోపాటు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయ పడుతుందని వివరించారు. ఆరోగ్యవంతమైన నూనెలు అయిన రైస్ బ్రాన్ ఆయిల్‌ను ప్రతి రోజూ వంటలో తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు.