Heavy Rains | మేడ్చల్ జిల్లాలో భారీ వర్షం.. హాస్టల్ మొదటి అంతస్తులోకి వరద నీరు
Heavy Rains | మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచికొట్టాయి. జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మ గూడ నీట మునిగింది.
Heavy Rains | మేడ్చల్ మల్కాజ్గిరి : మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచికొట్టాయి. జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మ గూడ నీట మునిగింది. ఇంజినీరింగ్ విద్యార్థులు ఉంటున్న ప్రయివేటు హాస్టల్స్ మొదటి అంతస్తులోకి వరద నీరు వచ్చి చేరింది. సుమారు 15 అపార్ట్మెంట్లలో ఇదే పరిస్థితి నెలకొంది. వరద నీరు హాస్టల్స్లోకి చేరడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. విద్యార్థులను పొక్లెయిన్ల సాయంతో బయటకు తరలించారు.

ఇక కూకట్పల్లి సర్కిల్ ఆల్విన్ కాలనీ డివిజన్ ధరణి నగర్ కాలనీ రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువన ఉన్న పరికి చెరువు నుంచి సమీప ప్రాంతాలకు భారీగా నురగ వస్తోంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

