Fire Accident | మణికొండలోని అపార్టుమెంటులో భారీ అగ్నిప్రమాదం.. వీడియో
హైదరాబాద్ మణికొండలోని పుప్పాలగూడలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. గోల్డెన్ ఒరియల్ అపార్టుమెంటులో ఉన్న ఓ ఫ్లాట్లో షార్ట్సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్యాస్ సిలిండర్ పేలడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది.
మణికొండ: హైదరాబాద్ మణికొండలోని పుప్పాలగూడలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. గోల్డెన్ ఒరియల్ అపార్టుమెంటులో ఉన్న ఓ ఫ్లాట్లో షార్ట్సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్యాస్ సిలిండర్ పేలడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. మంటలు భారీగా ఎగసిపడటంతో భయాందోళనలకు గురైన ఫ్లాట్లో ఉంటున్న ఐదుగురు కుటుంబ సభ్యులతోపాటు అపార్టుమెంటు వాసులు బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైర్ఇంజిన్లతో మంటలను అదుపుచేశారు.

అయితే అప్పటికే ఫ్లాట్ పూర్తిగా దగ్ధమైంది. డబ్బులు, బట్టలు, విలువైన సామాగ్రి కాలి బూడిదయ్యాయి. సుమారు రూ.50 లక్షల ఆస్తి నష్టం సంభించినట్లు బాధితులు వాపోయారు. కాగా, ఫైర్ ఇంజిన్ పోవడానికి దారి లేకపోవడంతో గంట పాటు అగ్నిమాపక సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nitish Kumar | నితీశ్ కోసం తొమ్మిది హత్యలు చేశా.. జేడీయూ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
West Bengal | కోల్కతా నవరాత్రుల్లో విషాదం.. 17 మంది దుర్మరణం
India vs West Indies | వరుణుడే విజేత.. ఐదో టీ20 వాన ఖాతాలోకి.. 2-2తో సిరీస్ పంచుకున్న భారత్, విండీస్
KTR | బ్రెయిన్ క్యాన్సర్ బాధితుడికి కేటీఆర్ భరోసా.. మెరుగైన వైద్యానికి సాయం చేస్తానని హామీ
KCR | కేసీఆర్ సార్ క్షమించండి!.. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేసినం.. న్యూస్ చానల్ డిబేట్ లైవ్లో ఓ రైతు ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

