సిటీబ్యూరో, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని నాలాల పూడికతీత పనులు కాంట్రాక్టర్లు, ఇంజినీర్ల పాలిట కామధేనువుగా మారాయి. వర్షాకాలంలో వరద ముంపుతో జనం ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా రూ.45 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు నిధులు కేటాయిస్తుంటే.. ఆ నిధులు మాత్రం ప్రజాప్రతినిధులు, అధికారుల జేబుల్లోకి వెళ్తున్నాయి. నాలాల్లో పూడిక తీయకుండానే, తీసినట్లు రికార్డులు సృష్టించి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్న అక్రమాల పర్వం మరోసారి వెలుగు చూసింది.
జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 900 కిలోమీటర్ల మేర నాలాలు విస్తరించి ఉన్నాయి. ఇందులో 398 కి.మీ. భారీ నాలాలు ఉండగా, 600 కి.మీ. మేర పైప్ లైన్ డ్రెయిన్లు, చిన్న నాలాలు ఉన్నాయి. వీటిలోని పూడికను తొలగించి జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలించాల్సిన బాధ్యతను కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ, పర్యవేక్షణను ఇంజనీర్లకు ఇచ్చారు. అయితే పూడిక తీయకుండానే తీసినట్లు క్యూబిక్ మీటర్లలో లెకలు రాసి, డంపింగ్ యార్డుకు తరలించినట్లు నకిలీ బిల్లులు క్లెయిమ్ చేశారు. ఈ రవాణా కోసం వినియోగించిన వాహనాల నంబర్లను పరిశీలిస్తే అధికారుల చేతివాటం నిర్ఘాంతపరుస్తోంది. రోడ్డుపై తిరగని మూలనపడ్డ కార్లు, లారీలు, ఆఖరికి ఆటోలు, ద్విచక్రవాహనాల (బైక్ లు) నంబర్లను రికార్డుల్లో నమోదు చేసి రూ.కోట్లలో బిల్లులు స్వాహా చేశారు.
2024-25 కాలంలో పాతబస్తీలోని మురీ నాలా, శంకర్ పల్లి నుంచి అహ్మద్ నగర్, చింతల్ బస్తీ మీదుగా హుస్సేన్ సాగర్‌లో కలిసే బలాపూర్ నాలాలో పూడికతీత పనులు అస్సలు జరగలేదని, తమ సిఫార్సులను సైతం పకనబెట్టారని సిటీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు నేరుగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌కు ఫిర్యాదు చేశారు. పాతబస్తీతో పాటు న్యూసిటీ నాలాల్లోనూ ఇదే తరహా కుంభకోణం జరిగిందని ఆధారాలతో సహా వివరించారు. ఖైరతాబాద్ జోన్‌కు చెందిన ఒక ఇంజినీర్ కాంట్రాక్టర్లతో మిలాఖత్ అయి ఈ దోపిడీకి సహకరించారన్న ఆరోపణలు రావడంతో, ఆయనను రెండు సరిళ్ల బాధ్యతల నుంచి తప్పించి ఒకే సరిల్కు పరిమితం చేశారు. ఎమ్మెల్యేల ఫిర్యాదుతో స్పందించిన కమిషనర్ ఆర్వీ కర్ణన్, సమగ్ర వాస్తవాలను బయటకు తీయాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు.
పద్నాలుగేళ్ల కిందట సరిగ్గా ఇదే తరహాలో రూ.40 కోట్ల నాలా పూడికతీత సాం వెలుగులోకి వచ్చింది. అప్పట్లో ఏకంగా 10 మంది ఇంజినీర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత పూడికతీతను కేవలం వేసవికే పరిమితం చేయకుం డా ఏడాది పొడవునా చేపట్టాలని, పర్యవేక్షణను హైడ్రాకు అప్పగించాలని సంసరణలు తెచ్చినా అక్రమారుల తీరు మారలేదు. విచారణల పేరుతో కాలయాపన జరుగుతుందే తప్ప, ప్రజాధనం పకదారి పట్టడం మాత్రం ఆగడం లేదని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.