Car accident | అబిడ్స్‌లో సినీ నిర్మాత బొమ్మకు మురళి(Film producer Bommaku Murali) కారు బీభత్సం సృష్టించింది. నడుచుకుంటూ వెళ్తున్న మహిళను మురళి కారు డ్రైవర్ ఢీకొట్టాడు(Car accident). ఈప్రమాదంలో మహిళ కాలు ఫ్రాక్చర్ అయింది. తీవ్ర గాయపడిన క్షతగాత్రురాలిని స్థానికులు ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం డబ్బులు చెల్లించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు నిర్మాతను కోరారు. కారు తనదే కానీ డబ్బులు ఇవ్వనంటూ… యాక్సిడెంట్ చేసిన డ్రైవర్‌ను చంపుకోండి అంటూ బొమ్మకు మురళి దురుసుగా సమాధానమిచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసున మోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
అబిడ్స్‌లో సినీ నిర్మాత బొమ్మకు మురళీ కారు బీభత్సం
నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై ఒక్కసారిగా కారు ఎక్కించిన నిర్మాత కారు డ్రైవర్
ప్రమాదంలో మహిళ కాలు ఫ్రాక్చర్
తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలింపు
హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం డబ్బులు చెల్లించాలని నిర్మాతను… pic.twitter.com/v7PeHZnMY9
— Telugu Scribe (@TeluguScribe) August 13, 2026