మూడోరోజూ కొనసాగుతున్న ఇంటింటి సర్వే

41,305 వేల ఇండ్లలో పరిశీలన
బుధవారం ఒక్కరోజే 707 బృందాలతో శోధన
ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖలకు చెందిన బృందాలు కొవిడ్ నియంత్రణలో భాగంగా మూడో రోజైన బుధవారం ఇంటింటికీ తిరిగి జ్వరం, కొవిడ్ లక్షణాలున్న వారి సర్వే చేపట్టారు. 707 బృందాలు సర్వేలో ప్రధానంగా పాల్గొన్నారు. ఒక్కో బృందంలో ఒక ఏఎంఎం, ఆశా వర్కర్, జీహెచ్ఎంసీ ఎంటమాలజీ వర్కర్‌తో కూడిన సభ్యులు ఇంటింటికీ తిరిగి ధర్మోస్కానర్తో 41,305 ఇండ్లలో ఫీవర్ సర్వే చేపట్టారు. ఈ బృందాలు జ్వరంతో బాధపడుతున్న వారి వివరాలను సేకరించి వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా చర్యలు చేపడుతున్నారు. సోమవారం 393 మందితో ప్రారంభమైన సర్వే మంగళవారం 641 బృందాలు, బుధవారం 707 బృందాలతో సర్వే ప్రక్రియలో వేగం పెంచారు. ప్రతి బస్తీ దవాఖాన, అర్బన్ హెల్త్ సెంటర్లు, ఇతర దవాఖానాలో కొవిడ్ ఔట్ పేషెంట్ల పరీక్ష లు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అన్ని ఆసుపత్రులలో 19,090 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేపట్టారు.
సలహాలు.. సూచనలు..
- జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లలో ఈ సర్వే జరుగుతున్నది.
- ఏఎంఓహెచ్‌ల పర్యవేక్షణలో ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, ఎంటమాలజీ సిబ్బందితో బృందాలను ఏర్పాటు చేశారు.
- వారి పరిధిలో ఇంటింటి సర్వే చేసేలా ప్రస్తుతం ఏర్పాటు చేసిన బృందాలు పనిచేస్తున్నాయి.
- గ్రేటర్లో 20 లక్షల వరకు ఇళ్లు ఉన్నాయి.
- ఆశా వర్కర్ల పరిధి పరిమితంగా ఉన్న నేపథ్యంలో వీలైనంత త్వరగా సర్వే చేయాలని భావిస్తున్నారు.
- క్రమం తప్పకుండా ఇంటింటికీ వెళ్లి ఫీవర్, పల్స్ సర్వే నిర్వహిస్తున్నారు.
- జ్వరం ఉందా? లేదా? అన్నది ఈ బృందాలు చెక్ చేస్తున్నాయి.
- థర్మా మీటర్‌తో పాటు ఆక్సో మీటర్‌తో పల్స్ రేట్‌ను పరిశీలిస్తున్నారు.
- దానిని బట్టి ఆసుపత్రికి వెళ్లాలా? వద్దా? అన్నది సూచిస్తున్నారు.
- జ్వరం ఉంటే ఇతరత్రా లక్షణాలడిగి తెలుసుకుంటున్నారు.
- సాధారణ జ్వరం ఉంటే పారాసిటమాల్/డోలో 650తో పాటు విటమిన్ మాత్రలు ఇస్తున్నట్లు ఏఎంహెచ్ఓ అధికారులు తెలిపారు.
- కరోనా లక్షణాలుంటే ఐదు రోజులకు సరిపడా ఆయా మాత్రలతో పాటు వైద్యులు సూచించే యాంటీ బయాటిక్స్ ఇస్తున్నారు.
- తీవ్ర జ్వరం ఉండి తగ్గకున్నా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా, ఇతరత్రా సమస్యలు తలెత్తితే దవాఖానాకు వెళ్లాలని చెబుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
‘కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు కొనసాగించాలి’
ఆంధ్రా విద్యుత్ పునరుద్ధణ పనుల్లో మన ఉద్యోగులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

