ఖైరతాబాద్, డిసెంబర్ 7: నగరంలో ఈ నెల 9న ఫర్టీ 9 సంతాన సాఫల్య కేంద్రం ఆధ్వర్యంలో బేబీ మీట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సి. జ్యోతి తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన లోగోను డాక్టర్ శశిప్రియ, డాక్టర్ మోనికా, ఇంద్రనీల్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి మహిళకు మాతృత్వం ఎంతో విలువైనదని, కొందరు ఆరోగ్య సమస్యలు, ఇతర కారణాల వల్ల దానిని పొందలేకపోతారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్నోరకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయని, జిట్ట్రిక్ విధానాన్ని తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో ప్రవేశపెడుతున్నాయని తెలిపారు. తద్వారా ల్యాబ్‌లో పిండం అభివృద్ధి చెందేందుకు 24 గంటల పాటు పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. బేబీ మీట్ సందర్భంగా ఫర్టీ 9 ద్వారా జన్మించిన 79 మంది శిశువులతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అలాగే, ఈ నెల 9 నుంచి 31వ తేదీ వరకు మహిళలకు ఉచితంగా అల్ట్రా సౌండ్, ఏఎంహెచ్ టెస్ట్ తదితర పరీక్షలను నిర్వహిస్తామన్నారు.