సిటీబ్యూరో, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా గుట్టురట్టయింది. నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితులను పట్టుకున్నారు. గురువారం బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ భవన్లో టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైవీఎస్ సుధీంద్ర వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్ కలాసిగూడకు చెందిన యెల్గం రాజ్‌కుమార్ ఆర్ఎస్ ఆన్లైన్ సర్వీస్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు.
సర్వశిక్ష అభియాన్‌లో కాంట్రాక్టు వర్కర్‌గా పనిచేసే ఎల్బీనగర్ ఎన్టీఆర్నగర్కు చెందిన ఎండీ మహబూబ్‌కు స్కూళ్లలో ఆధార్‌కార్డులో మార్పులు చేర్పులు చేసేందుకు అనుమతి ఉంది. ఈ అవకాశాన్ని అక్రమ పద్ధతిలో ఆర్ఎస్ ఆన్‌లైన్‌లోనూ వాడుకుంటున్నారు. రాచమల్ల విజయ లక్ష్మి, కురపాటి పల్లవి ఈ సర్వీస్ సెంటర్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తూ డెస్క్‌టాప్ అప్లికేషన్ మ్యాజికల్/యూనివర్సల్ యాప్‌లను ఉపయోగించి నకిలీ సర్టిఫికెట్లు తయారు చేయడం, నకిలీ సంతకాలు చేయడం చేస్తుంటారు. పాస్ పోర్ట్ ఏజెంట్‌గా పనిచేస్తున్న బండి శంకర్, జీహెచ్ఎంసీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసే గిరిరాజ్ అనిల్‌కుమార్‌తో ఒక ముఠాను ఏర్పాటు చేశారు.
ఆర్ఎస్ ఆన్లైన్ సర్వీస్ సెంటర్లో వివిధ రకాల సేవలు అందిస్తుంటారు. ఇందులో భాగంగా అసలైన ఓటర్ ఐడీ కార్డులు, బర్త్ సర్టిఫికెట్లు, ఆధార్, బర్త్, పాన్ కార్డులు ఇస్తుంటారు. దీంతో పాటు అవసరమైన వారికి నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అర్హత లేని వారికి ఇక్కడి నుంచి ఆధార్‌కార్డు, పాస్‌పోర్టు కావాలని ఆయా ఏజెంట్లు కస్టమర్లను ఈ ముఠా నాయకుడు రాజ్‌కుమార్‌కు అప్పగిస్తారు. వచ్చిన కస్టమర్‌కు మొదట నకిలీ ఐడీ కార్డును తయారు చేస్తారు.
ఆ చిరునామాను ఉపయోగించి ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసి.. ఆధార్ కార్డును పొందుతారు. ఆ తరువాత అదే చిరునామాతో పాస్‌పోర్టును పొందుతారు. ఇలా వివిధ రకాలైన సర్టిఫికెట్లు తయారు చేస్తూ మీ సేవలు, ఇతరత్రా ఆన్లైన్ సర్వీస్‌లు నిర్వహించే వారితో పాటు పలువురు ఏజెంట్లను నియమించుకొని కస్టమర్లను రప్పించుకుంటూ.. నకిలీ సర్టిఫికెట్ల దందా చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సెంటర్ నుంచి పదేండ్లలో 1200 పాస్ పోర్టులు జారీ అయితే.. అందులో 50 నకిలీ డాక్యుమెంట్లను ఉపయోగించి.. పాస్ పోర్టులు పొందినట్లు డీసీపీ వెల్లడించారు.
ఆర్ఎస్ ఆన్లైన్ సర్వీస్ నిర్వాహకుడి ఏజెంట్ శ్రావణ్ కుమార్‌ను గతేడాది జూన్‌లో నేరేడ్మెట్ పోలీసులు అరెస్ట్ చేశారని, ఆ సమయంలో అతడు 9 ఏండ్ల డేటాను పూర్తిగా ధ్వంసం చేశాడని డీసీపీ వెల్లడించారు. పదేండ్లలో 50 వేల ఓటర్ కార్డులు జారీ అయ్యాయని తెలిపారు. ఈ ఏడాది కాలంలో జారీ చేసిన నకిలీల వివరాలు కంప్యూటర్ నుంచి పోలీసులు సేకరించారు. ఇందులో నలుగురు ప్రభుత్వ అధికారుల పేరుతో స్టాంప్‌లు తయారు చేసి వారికి తెలియకుండా వీళ్లే గెజిటెడ్ సంతకాలు చేస్తున్నారు.
ఇదిలాఉండగా నకిలీ ఓటర్ ఐడీ కార్డులు, బర్త్ సర్టిఫికెట్లను ఉపయోగించి నేపాల్ దేశానికి చెందిన వారు పాస్ పోర్టులు పొందారని డీసీపీ వివరించారు. నేపాల్‌కు చెందిన వారు వెయ్యి నకిలీ ఓటర్ ఐడీ కార్డులు, 750 నకిలీ బర్త్ సర్టిఫికెట్లు, 1500 ఫేక్ ఆధార్ కార్డులు సేకరించినట్లు డీసీపీ వెల్లడించారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరుపాల్సి ఉన్నదని, ఇతర దేశస్తులు నకిలీ సర్టిఫికెట్లు వెళ్లి పాస్‌పోర్టులు పొందారా? అనే విషయాలు ఆరా తీయాల్సి ఉన్నదని డీసీపీ వివరించారు.