అటు ఈవీడీఎం..ఇటు పోలీస్
జీహెచ్ఎంసీలో నకిలీ జనన, మరణ ధ్రువపత్రాల వ్యవహారంపై విచారణ వేగవంతం చేశారు. 30 సర్కిళ్ల పరిధిలో సరైన పత్రాలు లేకుండా కేవలం తెల్ల కాగితాలు అప్లోడ్ చేసి 27,328 జనన, 4,126 మరణ ధ్రువపత్రాలు జారీ చేయడం.. వాటిని రద్దు చేయడం..
- నకిలీ జనన, మరణ ధ్రువపత్రాల జారీ
- విచారణకు రెండు ప్రత్యేక బృందాలు
- అధిక శాతం జారీ అయిన సర్కిళ్లపై ఫోకస్
సిటీబ్యూరో, మార్చి 9 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీలో నకిలీ జనన, మరణ ధ్రువపత్రాల వ్యవహారంపై విచారణ వేగవంతం చేశారు. 30 సర్కిళ్ల పరిధిలో సరైన పత్రాలు లేకుండా కేవలం తెల్ల కాగితాలు అప్లోడ్ చేసి 27,328 జనన, 4,126 మరణ ధ్రువపత్రాలు జారీ చేయడం.. వాటిని రద్దు చేయడం.. ఇందులో అర్హుల కోసం ప్రత్యేకంగా మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించడం లాంటివి చేశారు.
ఇదంతా ఒక ఎత్తయితే మరో వైపు ఈ అక్రమాల వెనుక ఎవరి పాత్ర ఎలా ఉందనే అంశంపై నిగ్గు తేల్చేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం) బృందం గడిచిన రెండు రోజులుగా విచారణ జరుపుతున్నది. ప్రాథమిక అంచనా మేరకు 15 మీ సేవా సెంటర్ల నిర్వాహకులు, సంబంధిత కంప్యూటర్ ఆపరేటర్లను ఆరా తీస్తున్నారు. ఇదే సమయంలో జీహెచ్ఎంసీ ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు సైతం విచారణకు రంగంలోకి దిగారు.
మెహిదీపట్నం సర్కిల్లో 5,877 నకిలీ పత్రాలు మంజూరు చేయడం..ఆ తర్వాతి స్థానంలో చార్మినార్ 3,949, బేగంపేట 2787, సికింద్రాబాద్‌లో 1,702 సర్టిఫికెట్లు జారీ చేసినట్లు గుర్తించగా..వీటి ఆధారంగా స్థానిక పోలీసులు ఆయా మీ సేవా సెంటర్ నిర్వాహకులతో పాటు సంబంధిత ఏఎంఓహెచ్‌లకు నోటీసులు ఇస్తూ విచారణ జరుపుతున్నారు. ఏకకాలంలో ఈవీడీఎం, స్థానిక పోలీసులు విచారణకు రంగంలోకి దిగడంతో అక్రమార్కుల్లో దడ మొదలైంది. ఒకటి రెండు రోజుల్లో ఈ విచారణపై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

