ఎఫ్బీలో పరిచయం.. రూ. 9 లక్షలు టోకరా

సిటీబ్యూరో, జూలై 12(నమస్తే తెలంగాణ): ఫేస్బుక్(ఎఫ్బీ)లో పరిచయమైన ఓ మహిళ.. ఆయిల్ వ్యాపారం చేద్దామంటూ నమ్మించి నగరవాసికి రూ. 9 లక్షలు టోకరా వేసింది. బర్కత్పురాకు చెందిన వజారావు ప్రభుకు ఫేస్బుక్ ద్వారా అగత విలియమ్స్ అనే మహిళ పరిచయమైంది. ఇద్దరూ కొన్నాళ్లు మాట్లాడుకొని వాట్సాప్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. తాను లండన్‌లో ఉంటూ జింగోకో హెర్బల్ ఆయిల్ వ్యాపారం చేస్తున్నానని, ముడి సరుకు అంతా ముంబాయిలోని శర్మ ఎంటర్ప్రైజెస్ నుంచి వస్తుందని, నేను అక్కడి నంబర్ ఇస్తాను, కొనుగోలుచేసి మాకు పంపిస్తే డబుల్ రేట్ నీకు వస్తుందంటూ ప్రభును నమ్మించింది. ఆమె మాటలు నమ్మిన ప్రభు.. ముంబాయిలో ఉన్న శర్మ ఎంటర్ప్రైజెస్ నుంచి ఆయిల్ కొనుగోలు చేసి, రూ. 9 లక్షలు వెచ్చించాడు. మరో ఐదు లీటర్లు కొంటేనే ఇక్కడ కంపెనీ ఒప్పుకుంటుందంటూ సదరు మహిళా ఒత్తిడి చేసింది. ఇదంతా మోసమని గ్రహించిన బాధితుడు సోమవారం సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
మరో ఘటనలో,..
జూబ్లీహిల్స్‌కు చెందిన రవికుమార్‌కు తాము బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని, మీ క్రెడిట్ కార్డు లిమిట్‌ను పెంచుతామంటూ నమ్మించిన నేరగాళ్లు బాధితుడి నుంచి ఓటీపీలు తెలుసుకొని రూ. 1.14 లక్షలు కాజేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- facebook friendship
- fraud
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

