Experium Eco Park | మొయినాబాద్, జనవరి 27 : ప్రపంచ స్థాయిలో, ఇండియాలోనే అనేక ప్రత్యేకతలు సొంతం చేసుకున్న గొప్ప ప్రాజెక్టు ఈ-ఎక్స్ పీరియం పార్కు. ప్రపంచ దేశాల్లోని అరుదైన జాతుల మొక్కలు నాటడంతో పాటు అరుదైన సహజ సిద్ధమైన రాతి శిలలు ఇం దులో కనిపిస్తాయి. వందల, ఏండ్ల వయస్సు ఉన్న చెట్లతోపాటు రకరకాల పూల జాతుల మొక్కలు పార్కులో కనిపిస్తాయి. సుమారుగా 150 ఎకరాల విస్తీర్ణంలో రూ.450 కోట్లతో ఎక్స్ పీరియం గార్డెన్‌ను చేవెళ్ల నియోజకవర్గంలోని పొద్దుటూరు గ్రామంలో ఏర్పాటు చేశా రు. గార్డెన్ చైర్మన్ వరంగల్ జిల్లాకు చెందిన రామ్‌దేవ్‌రావు అనే పర్యావరణ ప్రేమికుడు.. తన తండ్రి స్ఫూర్తితో 25 ఏండ్ల నాటి కలను సాకారం చేసుకోబోతున్నాడు. ప్రకృతి, పర్యావరణాన్ని భావితరాల వారికి అం దించాలనే సంకల్పంతో గార్డెన్‌ను ఏర్పాటు చేశారు.
ప్రపంచంలోని 175 దేశాల్లో పర్యటించి.. 85 దేశాల నుంచి అనేక రకాల జాతుల మొక్కలను, చెట్లను తీసుకొచ్చి గార్డెన్లో పెట్టారు. రామ్‌దేవ్‌రావు 25 ఏండ్ల నాటి కలను సాకారం చేసుకోవడంతో పాటు పది మందికి సంతోషాన్ని ఇవ్వాలని , ఉపాధి కల్పించాలని, వీటన్నింటిని మంచి ప్రకృతిని, పర్యావరణానికి మేలు చేయాలని సంకల్పించారు. కలను సాకారం చేసుకోవడానికి 12 ఏండ్ల క్రితం యూనిక్ ట్రీస్ అనే కంపెనీ పెట్టారు. దాని ద్వారా ప్రపంచ స్థాయి గార్డెన్‌ను ఏర్పాటు చేయాలని సంకల్పించిన ఆ యన.. ఎక్స్ పీరియం అనే అద్భుతమైన గార్డెన్‌ను ఏర్పాటు చే శారు. దేశానికి తలమానికంగా మారనున్న భూతల స్వర్గాన్ని సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా నేడు ప్రారంభం కాబోతుంది.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని పొద్దుటూరు గ్రామ రెవెన్యూలో 150 ఎకరాల్లో 25 వేల జాతుల మొక్కలు ఏర్పాటు చేశారు. 85 దేశాల నుంచి దిగుమతి చేసుకున్న 10 లక్షల మొక్కలను, చెట్లు.. ఎక్స్ పీరియం గార్డెన్లో కనిపిస్తాయి. గార్డెన్లో ఏర్పాటు చేసిన మొక్కలు సుమారుగా రూ. లక్ష నుంచి 3.5 కోట్ల విలువైనవి. సుమారుగా రూ.150 కోట్ల విలువైన మొక్కలు, చెట్లు , వృక్షాలు కలిగిన ఏకైక పర్యాటక, పర్యావరణ ప్రదేశంగా ఏర్పాటు అయ్యింది. అదే విధంగా రూ. 5 లక్షల నుంచి రూ.కోటి రూపాయల విలువైన శిల్పాలను గార్డెన్లో ప్రదర్శించారు. రూ.50 కోట్ల ఖర్చుతో 150 ఎకరాలు వికసించేలా గ్లోగార్డెన్‌ను తయారు చేశారు. చెట్లతో చేసిన అత్యధిక సజీవ శిల్పాలు కలిగిన ఏకైక శిల్పకళాకేంద్రంగా రూపాంతరం చెందింది.
గార్డెన్లో మొక్కలు , శిల్పాలతో పాటు ఇండియాలో ఎక్కడ లేని విధంగా అత్యధిక అడ్వెంచర్ గేమ్స్ ఉన్నాయి. ఇందు లో 15 వందల మంది సామర్థ్యం గల లార్జెస్ట్ హంపి థియేటర్‌ను నిర్మించారు. దేశం లో ఇప్పటి వరకు లేని విధంగా అక్వేరియం రెస్టారెంట్ ను ఏర్పాటు చేశారు. దేశంలో ఇప్ప టి వరకు ఎక్కడ కూడా ఏర్పాటు చేయని విధంగా అతి పెద్ద స్నో పా ర్కు, అతి పొడవైన బాక్స్ క్రికెట్ ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే ఏ దేశంలో లేని రీతిలో మొట్టమొదటి కాఫీ షాపు సహజ రాతి బార్ కౌంటర్, ఆర్టిఫిషియల్ మౌట్స్ ల్యాండ్ స్కేపింగ్ ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో గార్డెన్‌లోని 12 ఎకరాల విస్తీర్ణంలో రూ.50 కోట్ల ఖర్చుతో మ్యాన్ మేడ్ బీచ్‌ను ఏర్పాటు చేయాలని సంకల్పించారు.
గార్డెన్లో పైకస్ జాతికి చెందిన 5 వేల సంవత్సరాల క్రితం చెట్టును ఏర్పాటు చేశారు. గౌతమ బుద్దుడు ఇదే చెట్టు కింద జ్ఞానోదయం పొందినట్టుగా.. పార్కుకు వచ్చే సందర్శకులు బుద్దుడు జ్ఞానోదయం పొందిన చెట్టు ఇదే అన్నట్టుగా ఏర్పాటు చేశారు. చెట్టు ప్రధాన వేరు భాగానికి రంద్రం చేసి బుద్దుడు తపస్సు చేస్తున్నట్టుగా తయారు చేశారు. చెట్టు అందరిని ఆకట్టుకునే విధంగా కమలం పువ్వులా డిజైన్ చేశారు. అదే విధంగా జీవంతో ఉన్న చెట్లతోనే కుర్చీలు, బల్లాల మాదిరిగా చెట్లను ఏర్పాటు చేశారు. 2008లో జరిగిన ఒలంపిక్స్ గేమ్స్‌లో వేలంపాటలో ఒక అరుదైన చెట్టును రూ.80 లక్షలకు రామ్‌దేవ్‌రావు కొనుగోలు చేసి..దానిని గార్డెన్లో అందంగా ఒలంపిక్ సింబల్ మాదిరిగా ఏర్పాటు చేశారు.