పకడ్బందీగా నాలా శుద్ధి
నగరంలో నాలా పూడికతీత పనులు నాణ్యతతో శరవేగంగా జరుగుతున్నాయి. రానున్న వర్షాకాలంలో ప్రమాదాలు జరగకుండా, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలను తీసుకునేందుకు సరిల్ వారీగా నాలాల విభాగాలను నిర్ధారించి అధికారులను బాధ్యులను చేయాలని కమిషనర్ నిర్ణయించారు.
- శరవేగంగా పూడికతీత పనులు
- వచ్చే నెల మొదటి వారంకల్లా పూర్తి
- పారదర్శకంగా పనులు..
- సోషల్ ఆడిట్ తప్పనిసరి
- రూ. 53.60కోట్లతో 56 చోట్ల పనులు
- 68 వేల క్యూబిక్ మీటర్ల పూడికతీత…
- వానకాలం ప్రమాదాలు జరగకుండా చర్యలు
సిటీబ్యూరో, మే 24 (నమస్తే తెలంగాణ) ; నగరంలో నాలా పూడికతీత పనులు నాణ్యతతో శరవేగంగా జరుగుతున్నాయి. రానున్న వర్షాకాలంలో ప్రమాదాలు జరగకుండా, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలను తీసుకునేందుకు సరిల్ వారీగా నాలాల విభాగాలను నిర్ధారించి అధికారులను బాధ్యులను చేయాలని కమిషనర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అధికారులు సోషల్ ఆడిట్ విధానం ద్వారా పనులు చేపడుతున్నారు. పూడిక పనుల సందర్భంగా తొలగించిన మట్టి పరిమాణం, తరలింపు, కూలీలు, జేసీబీలతో కూడిన వివరాలను పొందుపరిచి స్థానిక ప్రముఖులతో ధ్రువీకరణ సంతకాలు సేకరిస్తున్నారు. 2023 సంవత్సరానికి రూ. 53.60 కోట్లతో 56 చోట్ల పనులు చేపట్టగా, ఇప్పటి వరకు 68వేల క్యూబిక్ మీటర్ల పూడిక తీశారు. వచ్చే నెల మొదటివారం వరకు నాలా పూడికతీత పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా అధికారులు పనుల్లో వేగం పెంచారు.
నాలా పూడికతీత పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. గతంలో కంటే పనుల్లో పారదర్శకతకు పెద్దపీట వేసిన అధికారులు.. సోషల్ ఆడిట్ విధానం ద్వారా పనులు చేపడుతున్నారు. పూడిక పనుల సందర్భంగా తొలగించిన మట్టి పరిమాణం, తరలింపు, పాల్గొన్న కూలీలు, జేసీబీలతో కూడిన వివరాలను పొందుపరిచి స్థానిక ప్రముఖులతో ధ్రువీకరణ సంతకాలను కూడా సేకరించి పనులను పారదర్శకంగా చేపడుతున్నారు. గతంలో ప్రాంతాల వారీగా చిన్న చిన్న పనులుగా విభజించి.. సర్కిళ్లలో ఆ పనులను అప్పగించారు. తద్వారా సకాలంలో పనులు పూర్తి కాకపోవడం, జరిగిన పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, వర్షాకాలంలో నాలాలు ఉప్పొంగడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈసారి వీటన్నింటికీ శాశ్వతంగా చెక్ పెట్టాలని నిర్ణయించారు. రూ.2 నుంచి 2.5 కోట్ల వరకు ప్యాకేజీల వారీగా పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే 2023 సంవత్సరానికి రూ. 53.60 కోట్లతో 56 చోట్ల పనులు చేపట్టారు. ఇప్పటి వరకు 68వేల క్యూబిక్ మీటర్ల పూడికతీత పనులు చేపట్టారు. వచ్చే నెల మొదటి వారం నాటికల్లా నాలా పూడికతీత పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా అధికారులు పనుల్లో వేగం పెంచారు.
గ్రేటర్ పరిధిలో దాదాపు వెయ్యి కిలోమీటర్ల విస్తీర్ణంలో మురుగునీటి, వరద నీటి కాలువలు ఉన్నాయి. వీటిలో 216 మేజర్ నాలాలు, 735 కిలోమీటర్ల విస్తీర్ణంలో పైప్ లైన్ డ్రైన్లు, చిన్న సైజు డ్రైన్లు ఉన్నాయి. మేజర్ నాలాల్లో మెషిన్ల ద్వారా, పైప్ లైన్ డ్రైన్లలో రీసైక్లర్స్ ద్వారా, చిన్న సైజు నాలాల్లో మ్యాన్ వల్గా పూడికతీత పనులు చేపడుతున్నారు. నాలాల్లో పూడికను తొలగించడంతోపాటు ఆ పూడికను సమీపంలోని డంపింగ్ యార్డుకు తరలించే బాధ్యత కూడా కాంట్రాక్టర్‌పైనే ఉంటుంది. వీటితోపాటు రానున్న వర్షాకాలంలో ప్రమాదాలు జరగకుండా, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలను తీసుకున్నారు. ఇందుకు సరిల్ వారీగా నాలాల విభాగాలను ( సెచెస్) నిర్ధారించారు. ఒకొక విభాగానికి ఒక ఏఈ గానీ, డిప్యూటీ ఈఈలను బాధ్యులను చేయాలని కమిషనర్ నిర్ణయించారు. సంబంధిత ఇంజినీరింగ్ మెయింటెనెన్స్, ఈఎన్సీ క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న ఇంజినీరింగ్ అధికారులకు మేయర్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు డిప్యూటీ కమిషనర్లు, ఈఈలు ఒకొక విభాగానికి ఒక ఇంజినీరింగ్ అధికారిని నియమించారు. కేటాయించిన సెచెస్లో పూడికతీత, ఇతర లోపాలను గుర్తించి ఏమైనా మిస్సయిన నాలాల పూర్తి వివరాల నివేదికను ఈ నెల చివరిలోగా అందజేయనున్నారు. అంతే కాకుండా ప్రహరీల పునరుద్ధరణ, చైన్ లింక్, ఫెన్సింగ్, బ్యారికేడ్లు, ఓపెన్ నాలా , డ్రైన్ల ఫెన్సింగ్, హెచ్చరిక బోర్డులు, ప్రమాదాలు జరగకుండా సూచించే మార్లు.. వాటితోపాటు ఓపెన్ నాలా బాక్స్ డ్రైన్, స్టార్మ్ వాటర్ డ్రైన్లలో కూడా ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

