సిటీబ్యూరో, మే 21 (నమస్తే తెలంగాణ): గుల్జార్‌హౌస్ వద్ద అగ్నిప్రమాదం ఘటన నేపథ్యంలో విద్యుత్ భద్రతానిబంధనలను కఠినంగా పాటించాలంటూ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ ప్రజలకు సూచించింది. హాస్పిటల్స్, మల్టీస్టోర్డ్ బిల్డింగ్స్, బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్సులు, సినిమాహాళ్లు, హోటల్స్, ఇతర ప్రజా సౌకర్యాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని వెల్లడించింది. విద్యుత్ సురక్షిత వినియోగం కోసం విద్యుత్ చట్టం 2003, నియమనిబంధనలు, అదనపు మార్గదర్శకాలను అనుసరించాలని తెలిపింది. ఆయా సంస్థల నిర్వాహకులు ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్లు, డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్లు ఇచ్చిన సూచనలను కచ్చితంగా పాటించాలని లేనట్లయితే విద్యుత్ చట్టం 2003 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
సీఈఐజీ (చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ టు గవర్నమెంట్) మార్గదర్శకాలివే..!