చర్లపల్లి, డిసెంబర్ 22 : చర్లపల్లి డివిజన్ పరిధిలో క్రైస్తవుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. గురువారం డివిజన్ పరిధిలోని చిన్న చర్లపల్లి బెరాకా ప్రార్థన మందిరంలో సొంత నిధులతో పాస్టర్లు, సేవకులకు వారు క్రిస్మస్ కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ..
క్రిస్మస్ సందర్భంగా చర్చిల వద్ద సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ముఖ్యంగా కానుకలను అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్ష, కార్యదర్శులు పిలిఫ్స్, బీబీ పాల్, పాస్టర్లు చిట్టిబాబు, మాణిక్యాలరావు, బాలస్వామి, విద్యాసాగర్, శ్రీనివాస్, కిష్టోఫర్, డానియెల్, జైపాల్, జాన్ కెన్నెడి, ఏసయ్య, జాన్, ప్రభాకర్, చక్రపాణి, జాన్నాయక్, రా జు, బీఆర్ఎస్ నాయకులు నాగిళ్ల బాల్రెడ్డి, బొడిగె ప్రభుగౌడ్, సత్తిరెడ్డి, నరేశ్, ధనుంజయ్యగౌడ్, భానుచందర్, ఎల్లయ్య, రాజు, మురళి, రామకృష్ణ, బాల్రాజు, శ్రీనివాస్, శేఖర్నాయక్, తదితరులు పాల్గొన్నారు.