ప్రభుత్వ పాఠశాలల అభివద్ధికి కృషి

చర్లపల్లి, జనవరి 7 : నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్థి చేసేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగూడ ప్రభుత్వ పాఠశాలలో రూ. 56లక్షల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులను ఆయన ఎమ్మెల్సీ కాటెపల్లి జనార్దన్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు రూ.1.40కోట్లు కేటాయించి పనులు చేపడుతున్నామని తెలిపారు. ప్రైవేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, విద్యార్థులు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ఈసీఐఎల్ పరిశ్రమ ముందుకు రావడం హర్షణీయమని అన్నారు.
విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు కృషి..
ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేస్తుందని ఎమ్మెల్సీ కాటెపల్లి జనార్దన్‌రెడ్డి అన్నారు. పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలలకు సహాయపడాలన్న తలంపుతో సొంత నిధులు కేటాయించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేడయం అభినందనీయమన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులు ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ కాటెపల్లి జనార్దన్‌రెడ్డిలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌బీకాలనీ కార్పొరేటర్ ప్రభుదాస్, డిప్యూటీ కమిషనర్ శంకర్, ఈఈ కోటేశ్వర్రావు, డీఈ శ్రీరాములు, ఏఈ సత్యలక్ష్మి, ఎలక్ట్రీకల్ ఏఈ ప్రత్యూష, ప్రధానోపాధ్యాయుడు రంగారెడ్డి, మాజీ కార్పొరేటర్లు సింగిరెడ్డి ధన్‌పాల్‌రెడ్డి, కొత్త రామారావు, ఉపాధ్యాయ సంఘం నాయకుడు రమేశ్‌రెడ్డి, సీసీఎస్ ప్రతినిధి ఎంపెల్లి పద్మారెడ్డి, చర్లపల్లి, ఏఎస్‌రావునగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, గిరిబాబు, సారా అనిల్, శ్రీనివాస్‌రెడ్డి, బాబు, వంశీరాజు, సర్ఫ్రాజు, గంప కృష్ణ, సారా వినోద్, ఎస్కే. కరీం, రెడ్డినాయక్, సత్యనారాయణ, వెంకటేశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

