చంపాపేట, జూన్ 7: కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయ అభివృద్ధికి కృషి చేయనున్నట్లు మండలి నూతన చైర్మన్ గా ఎన్నికైన ఈదులకంటి సత్యనారాయణ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ చంద్రశేఖర్, కార్యనిర్వహణ అధికారి లావణ్య ఆధ్వర్యంలో చైర్మన్ కార్యాలయంలో నిర్వహించిన ధర్మకర్తల మండలి సమావేశంలో ఈదులకంటి సత్యనారాయణ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అనంతరం నిర్వహించిన సమావేశంలో ఈదులకంటి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ధర్మకర్తల సహకారంతో దేవాలయం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఆలయ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని కోరారు. దేవాలయం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా కలవనున్నట్లు తెలిపారు.