సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ ) : ఈస్టర్ను పురస్కరించుకొని ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌కాలేజీలో హైదరాబాద్ సైక్లిస్టు గ్రూప్ ఆధ్వర్యంలో ఈస్టర్ రైడ్ నిర్వహించారు.
ఇందులో సైక్లిస్టులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సైక్లింగ్‌ను ప్రోత్సహించడంలో భాగంగా రైడ్ ఏర్పాటు చేసినట్టు ఆ సంస్థ ఫౌండర్ రవీందర్ తెలిపారు.