East Zone DCP: కాచిగూడ రైల్వే స్టేషన్ పరిధిలోని అండర్ బ్రిడ్జి వద్ద ఒక కారును నిలిపి ఉంచడం కలకలం రేపింది. ఢిల్లీ కారు బ్లాస్ట్ నేపథ్యంలో అనుమానాస్పదంగా కారు పార్క్ చేసి ఉండడం గమనించిన వాహనదారులు అప్రమత్తమై రైల్వే పోలీసులకు తెలియజేశారు. విషయం తెలిసిన వెంటనే తన బృందంతో కలిసి అక్కడికి చేరుకున్నఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి(East Zone DCP Balaswamy).. అనుమానంతో బాంబు, డాగ్ స్క్వాడ్లతో కారులో తనిఖీలు జరిపామని తెలిపారు.
‘స్థానికులు ఇచ్చిన సమాచారంతో వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నాం. భదత్రా చర్యల్లో భాగంగా బాంబు, డాగ్ స్క్వాడ్‌తో కారులో తనిఖీలు చేశాం. అందులో ఎలాంటి పేలుడు పదార్ధాలుగానీ, అనుమానస్పద వస్తువులుగానీ లేవు. ఆ కారును సమీర్ అనే వ్యక్తి బాలాజీ అనే వ్యక్తి నుంచి తీసుకున్నాడు. తాగిన మైకంలో సమీర్ ఆ కారును రైల్వే ట్రాక్‌పై ఉంచి వెళ్లిపోయాడు. సీసీ కెమెరాలను పరిశీలించి.. అతడిపై చర్యలు తీసుకుంటాం’ అని ఈస్ట్ జోన్ డీసీపి బాలస్వామి వెల్లడించారు. కారులో ఎలాంటి బాంబులు లేవని, తాగిన మత్తులో అక్కడ కారును వదిలేశారని డీసీపీ చెప్పడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు.
కాచిగూడ రైల్వే ట్రాక్ పై కారు కలకలం..
స్థానికులు ఇచ్చిన సమాచారంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీ చేశాం: బాలస్వామి, ఈస్ట్ జోన్ డీసీపీ
భద్రతా చర్యల్లో భాగంగా బాంబు, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశాం
కారులో ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు లేవు
కాచిగూడకు చెందిన… https://t.co/Jiwof8c9tD pic.twitter.com/7hPpaMrnYK
— BIG TV Breaking News (@bigtvtelugu) November 13, 2025