మెహిదీపట్నం అక్టోబర్ 4: దసరా పండుగకు ప్రజలు సందడిగా సంబురాలు జరుపుకోవడానికి “నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే”లు కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రజలకు డబుల్ సంబురాలను అందించడానికి దసరా పండుగ సందర్భంగా షాపింగ్ బొనాంజా పేరుతో లక్కీ డ్రాను నిర్వహిస్తున్నారు. దశాబ్ద కాలంగా కొనసాగిస్తున్న మూడో రోజు లక్కీ డ్రాను శుక్రవారం సాయంత్రం షేక్‌పేట్‌లోని కున్ హ్యూందాయ్ కార్ షోరూంలో నిర్వహించారు.
లక్కీ డ్రాలో ముగ్గురు విజేతలను డ్రా ద్వారా ప్రకటించారు. నమస్తే తెలంగాణ అడ్వర్టయిజ్మెంట్ జీఎం ఎన్.సురేందర్ రావు, షోరూం డీజీఎం ఆకుల కార్తీక్, వినయోగదారులు శ్రీనివాస్ రెడ్డి, షోరూం సేల్స్ మేనేజర్ శివాజీ, కస్టమర్ కేర్ మేనేజర్ శ్రీవాణిలతో కలిసి డ్రా తీశారు. మొదటి బహుమతి వినయ్ కుమార్‌కు, రెండో బహుమతి రాజ శేఖర్‌కు, మూడో బహుమతి రామ్‌లకు వచ్చింది.
‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డే’ల సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ డ్రాలో కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, బిగ్ సీ,అల్మండ్ హౌస్ భాగస్వామ్యం అందిస్తుండగా, ప్రచార కర్తగా టీ న్యూస్, డిజిటల్ ప్రచార కర్త సమన్ టీవీలు కొనసాగుతున్న బొనాంజాలో మూడో డ్రా కున్ హ్యూందాయ్‌లో నమస్తే తెలంగాణ అడ్వర్టయిజ్మెంట్ జీఎం ఎన్.సురేందర్ రావు చేతుల మీదుగా కొనసాగింది. ఈ నెల 9వ తేదీ వరకు కొనసాగనున్న దసరా బొనాంజాను గ్రేటర్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జీఎం సురేందర్ రావు అన్నారు.
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడేలలో వస్తున్న దసరా షాపింగ్ బొనాంజా ప్రకటనలు చూసి ఎంపిక చేసిన ఔట్లెట్లలో షాపింగ్ చేసి గిఫ్ట్ గెలుచుకోవాలని ఆయన సూచిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా నమస్తే తెలంగాణ నిర్వహిస్తున్న లక్కీ డ్రాను అందరు సద్వినియోగం చేసుకోవాలి. నమస్తే తెలంగాణలో వస్తున్న దసరా బొనాంజా ప్రకటనను చూసి డ్రాలో పాల్గొనాలి. నమస్తే తెలంగాణ ఏర్పాటు చేసిన ఔట్ లెట్లలో వస్తువులను కొని డ్రాలో అదృష్టాన్ని పొందాలని నమస్తే తెలంగాణ అడ్వర్టయిజ్ మెంట్ జీఎం సురేందర్ రావు తెలిపారు. కార్యక్రమంలో షోరూం డీజీఎం ఆకుల కార్తీక్, కస్టమర్ కేర్ మేనేజర్ శ్రీవాణి, మేనేజర్ శివాజీ, వినియోగదారుడు శ్రీనివాస్ రెడ్డి ఏడీవీటీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రాజిరెడ్డి, సుమన్ టీవీ సీఎంఓ చంద్రక్రాంతి కుమార్, అడ్వర్టయిజ్మెంట్ మేనేజర్ చరణ్ ఆనంద్ పాల్గొన్నారు.
దసరా సందర్భంగా బొనాంజాను అందించడం సంతోషంగా ఉంది. మా షోరూంలో కార్ డెలివరీ తీసుకున్న కస్టమర్లను డ్రాలో భాగస్వాములు చేశాము. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ప్రతి ఏడాది నిర్వహిస్తున్న డ్రా దసరాకు వినియోగదారులకు సంబురాలను తెస్తుంది. ప్రజలు డ్రా లో పాల్గొని బహుమతులు గెలుచుకోవాలి. పండుగకు బహుమతులు దొరకడం జీవితాంతం గుర్తుండి పోతుంది. దసరా సందర్భంగా కున్ హ్యుందాయ్‌లో రాయితీలు ఇస్తున్నాం. నమస్తే తెలంగాణ వారు కూడా దీనికి సమాంతరంగా ప్రతి రోజు బహుమతులు ఇస్తున్నందు వల్ల కొనుగోలుదారులకు అదనపు ప్రయోజనం చేకూరుతుంది.
– ఆకుల కార్తీక్ (డీజీఎం)
హ్యూండాయ్ ఐ20 వాహనం బుక్ చేసుకుందామని కున్ హ్యుందాయ్ షోరూమ్‌కు వచ్చినప్పుడు నమస్తే తెలంగాణ ఆఫర్ గురించి చెప్పారు. కున్ హ్యుందాయ్ రాయితీతో పాటు నమస్తే తెలంగాణ లక్కీడ్రాలో నాకు బహుమతి గెలుచుకునే అవకాశం కల్పించిన నమస్తే తెలంగాణకు ధన్యవాదాలు. ఇటువంటి ఆఫర్స్ కొనుగోలుదారులకు అదనపు రాయితీతో పాటు బహుమతులు గెల్చుకునే అవకాశాలను కల్పిస్తాయి. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన షాపింగ్ డబుల్ బొనాంజా లక్కీ డ్రాలో పాల్గొనడం ఆనందంగా ఉంది. లక్కీ డ్రాను నిర్వహించడం అభినందనీయం. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడేలు నిర్వహిస్తున్న ఈ లక్కీ డ్రాలో ప్రజలు పాల్గొనాలి. డ్రా విజేతగా అదృష్టం కలిసి వస్తే పండుగకు ఓ తీపి గుర్తును పొందవచ్చు.
– శ్రీనివాస్ రెడ్డి (వినియోగదారుడు)