ముందస్తు ప్రణాళికేది?
తాగునీటి సమస్య ఇప్పటి నుంచే తీవ్రమవుతున్నా.. ముందస్తు ప్రణాళికను సిద్ధం చేయడంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తున్నది. ఇప్పుడే ఇలా పరిస్థితి ఉంటే వేసవి కాలం ప్రారంభం అయితే పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన చెందుతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో లోటు వర్షపాతం నమోదుతో తాగునీటి సమస్యకు ముందుస్తు ప్రణాళికలను సిద్ధం చేసి తాగునీటి ఎద్దడి సమస్య రాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
- తరుముకొస్తున్న తాగునీటి సమస్య
- మేడ్చల్ జిల్లాలో లోటు వర్షపాతం
- ఇప్పటి నుంచే మొదలైన నీటి కష్టాలు
- వాటర్ ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్
మేడ్చల్, అక్టోబర్11(నమస్తే తెలంగాణ): తాగునీటి సమస్య ఇప్పటి నుంచే తీవ్రమవుతున్నా.. ముందస్తు ప్రణాళికను సిద్ధం చేయడంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తున్నది. ఇప్పుడే ఇలా పరిస్థితి ఉంటే వేసవి కాలం ప్రారంభం అయితే పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన చెందుతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో లోటు వర్షపాతం నమోదుతో తాగునీటి సమస్యకు ముందుస్తు ప్రణాళికలను సిద్ధం చేసి తాగునీటి ఎద్దడి సమస్య రాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లోని 15 మండలాల్లో తాగునీటి సమస్య ఏర్పడింది. జిల్లాలో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 584 మిల్ల్లీలీటర్ల వర్షపాతం ఉండాల్సి ఉండగా, 407.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై జిల్లాలో 30 శాతం లోటు వర్షపాతంగా నమోదైంది. దీంతో బోర్లు రీచార్జీ కాకపోవడంతో భూగర్భ జలమట్టం స్థాయి పెరగలేదు. దీంతో తాగు నీటితో పాటు నీటి అవసరాలు కూడా కష్టంగా మారాయి.
ముందుస్తు ప్రణాళికలో నిర్లక్ష్యం
తాగునీటి సమస్య తీవ్రమవుతున్నా.. అధికారులు మాత్రం ముందస్తు ప్రణాళికను చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రస్తుతం తాగునీటి సరఫరాను నాలుగు రోజులకొకసారి చేస్తుండగా మరిన్ని రోజుల్లో వారం రోజులకొకసారి తాగునీటి సరఫరా చేయాల్సి ఉంటుంది. తాగునీటి తో పాటు నీటి అవసరాలు ప్రజలకు తీర్చే విధంగా అధికారులు ముందస్తు ప్రణాళిక చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో మూడు రోజుల కిందట జరిగిన దిశ సమావేశంలో తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రజాప్రతినిధులు అధికారులకు ఆదేశించిన విషయం విధితమే.
అదనంగా వాటర్ ట్యాంకర్లు ఏవీ?
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లకు భారీగా డిమాండ్ పెరిగింది. 5 వేల లీటర్ల వాటర్ ట్యాంకర్‌కు ఇప్పుడే డిమాండ్‌ను బట్టి రూ. 6 వందల నుంచి రూ. 8 వందలకు విక్రయిస్తున్నారు. దీంతో ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లను కొనలేని పరిస్థితులలో నిరుపేదలు ఉన్నారు. దీంతో ప్రభుత్వం అదనంగా వాటర్ ట్యాంకర్లను మున్సిపాలిటీల, జీహెచ్ఎంసీ సర్కిళ్లకు అందించాలని కోరుతున్నారు. త్వరితగతిన ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసి నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
వాటర్ ట్యాంకర్లు అదనంగా మంజూరు చేయాలి
ప్రసుత్తం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీలకు అదనంగా వాటర్ ట్యాంకర్లను మంజూరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసుకొని నిరుపేదలకు ప్రస్తుతం జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీల్లో ఉన్న వాటర్ ట్యాంకర్లు సరిపోకపోవడంతో ప్రజలకు జీహెచ్ఎంసీ సర్కిళ్ల, మున్సిపాలిటీల పరిధిలోని స్థానికులకు సరిపోయేంత నీరు సరఫరా కావడం లేదు. దీంతో అదనంగా ప్రభుత్వం వాటర్ ట్యాంకర్లను మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజల నుంచి డిమాండ్లు వస్తున్నాయి.
జిల్లాలోని మండలాలలో లోటు వర్షపాతం ఇలా..
మండలంలోటు వర్షపాతం శాతం
మేడ్చల్ : 35
దుండిగల్ : 44
బాచ్‌పల్లి : 00
కుత్బుల్లాపూర్ : 31
కూకట్పల్లి : 13
బాలానగర్ : 27
అల్వాల్ : 28
మల్కాజిగిరి : 29
ఉప్పల్ : 42
మేడిపల్లి : 44
కాప్రా : 38
శామీర్‌పేట : 18
కీసర : 46
ఘట్కేసర్ : 44
మూడుచింతలపల్లి : 23
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

