రవీంద్రభారతి, అక్టోబర్ 13: తమ ప్యానెల్ గెలిస్తే ఆరోగ్య తెలంగాణ కోసం కృషి చేస్తామని, తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌కు జరుగుతున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పల్లం ప్రవీణ్, ఉపాధ్యక్షుడు ఐఎంఏ తెలంగాణ చైర్మన్ డాక్టర్ గట్టు శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పల్లం ప్రవీణ్ మాట్లాడుతూ.. రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌కు మొదటిసారిగా జరుగుతున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వైద్యుల ఫోరం(టీఎస్డీఎఫ్) ప్యానెల్ ద్వారా పోటీ చేస్తున్నామని, మా ప్యానెల్‌పై పోటీ చేస్తున్న వైద్యుల సంఘం(టీఎస్డీఎఫ్) ప్యానెల్‌ను గెలిపించాలని కోరారు.
టీఎస్డీఎఫ్ ఉపాధ్యక్షుడు ఐఎంఏ డాక్టర్ గట్టు శ్రీనివాసులు మాట్లాడుతూ.. మెడికల్ రిజిస్ట్రేషన్‌ను సులభతరం అయ్యేలా కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న ౪౯వేల వైద్యులు ప్రజల కోసం పని చేస్తున్న (టీఎస్డీఎఫ్)ప్యానల్‌కు ఓటు వేసి గెలించాలని ఆయన కోరారు. తమ ప్యానల్ అభ్యర్థులు డాక్టర్ లింగంగౌడ్, డాక్టర్ చీమ శ్రీనివాస్, డాక్టర్ ఐలయ్య యాదవ్, డాక్టర్ సీఆర్‌కే ప్రసాద్, డాక్టర్ ఆవుల మురళీధర్, డాక్టర్ పీవీ వెంకటేశ్వర్లు, డాక్టర్ ఉమాకాంత్ గౌడ్, డాక్టర్ చీకోటి సంతోష్, డాక్టర్ మువ్వ రామారావు, డాక్టర్ వసంతలు పోటీ చేస్తున్నారని తెలిపారు.