HCU | కొండాపూర్, ఆగస్టు 30: గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థికి ప్రతిష్టాత్మక డాక్టర్ దినేష్ మెమోరియల్ అవార్డుకు ఎంపికైంది. వర్సిటీలో స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్‌లో హెల్త్‌కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ (ఎంబీఏ)లో రెండో సంవత్సరం చదువుతున్న డాక్టర్ ఆర్య అగర్వాల్ ఈ అవార్డుకు ఎంపికైనట్లు యాజమాన్యం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్లో నిర్వహించిన డాటాకాన్ -2024 సదస్సులో ఆర్య అగర్వాల్ ‘డాటా డ్రైవెన్ డిసిషన్ మేకింగ్ ఇన్ ఎవిడెన్స్ – బేస్డ్ ప్రాక్టీస్’ అంశంపై ప్రెజెంటేషన్ ఇచ్చింది. డేటా వినియోగం ద్వారా ఆరోగ్య సంరక్షణను పెంపొందించే వినూత్న విధానాలను ప్రత్యేకంగా వివరించినట్లు, అత్యుత్తమ ప్రజెంటేషన్‌కు గాను ఆర్య అగర్వాల్‌కు రూ.10 వేల నగదుతో పాటు డాక్టర్ దినేష్ మెమోరియల్ అవార్డును అందుకున్నట్లు తెలిపారు.