జవహర్‌నగర్, మార్చి 11: జవహర్‌నగర్ యాప్రాల్, లాలాగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జంట హత్యలు కేసు నగరంలో సంచలనం సృష్టించిన విషయం విధితమే. ప్రేయసి దక్కదనే అక్కాసుతో ప్రియురాలి అక్క, తల్లిని చంపేస్తే పెండ్లికి అడ్డు ఉండొద్దని భావించి లాలాగూడలో అక్క జ్ఞానేశ్వరి(45)ని రొకలిబండతో కొట్టి చంపేసీ సమీపంలోని మురుగుకాలువలో పేడేయగా, తల్లి సుశీల(60) చీరతో మెడకు బిగించి ఊపిరాడకుండాచేసి చంపిన నిందుతులను జవహర్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. జవహర్‌నగర్ ఎస్‌హెచ్‌వో సైదయ్య తెలిపిన కథనం ప్రకారం… జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధి యాప్రాల్‌లో నివసించే ఊడుగుల సుశీల(60) ముగ్గురు కూతుర్లు జ్ఞానేశ్వరి(45), లక్ష్మి(40) , ఉమామహేశ్వరి(35), కుమారుడు శివ(37)తో కలిసి నివసిస్తున్నారు.
భర్త మరణించడంతో కారుణ్య నియామకంగా రెండో కూతురు లక్ష్మికి రైల్వే ఉద్యోగం రావడంతో అక్క జ్ఙానేశ్వరితో కలిసి లాలాగూడ రైల్వే క్వాటర్స్‌లో ఉంటున్నారు. అరవింద్కుమార్గుప్తా మేసీ్ర్త పనులు చేసుకుంటూ ఏఎస్‌రావునగర్ జేకేకాలనీలో నివసిస్తుండేవాడు. సుశీల కుటుంబం యాప్రాల్‌లో ఇల్లు నిర్మించే క్రమంలో అరవింద్‌కుమార్ గుప్తా పరిచయం అయ్యడు. పరిచయం కాస్తా ప్రేమగా మారి లక్ష్మితో సహజీవనం చేస్తుండేవాడు. మా వివాహానికి అడ్డం పడుతున్న జ్ఞానేశ్వరి, సుశీలను అంతమొందిస్తే అడ్డు ఉండదని భావించి ఈ నెల 3న జ్ఞానేశ్వరిని, 6న సుశీలను చంపేశారు. ఈ నెల 10న అరవింద్కుమార్గుప్తా, 11న లక్ష్మిని పట్టుకుని విచారించారు. అనంతరం అరవింద్కుమార్గుప్తా, లక్ష్మిని అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. జంటహత్యల కేసును ఛేదించిన జవహర్‌నగర్ పోలీసులను సీపీ సుధీర్‌బాబు అభినందించారు.