Hyderabad | హైదరాబాద్‌లో పబ్బులపై ఫోక్స్ పెట్టామని ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే తెలిపారు. నగరంలోని చాలా పబ్బుల్లో పార్కింగ్ సదుపాయం లేదని తెలిపారు. పబ్స్ దగ్గర కనీసం 40 శాతం పార్కింగ్ స్థలం ఉండాలన్నారు. సరైన పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో ఇష్టానుసారంగా రోడ్లపైనే పార్కింగ్ చేస్తున్నారని తెలిపారు. మైనర్లను పబ్‌లోకి అనుమతించవద్దని సూచించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ విషయానికొస్తే ఈ ఏడాదిలో ఇప్పటివరకు 50వేలకు పైగా కేసులు నమోదయ్యాయని రాహుల్ హెగ్డే తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఎక్కువగా 25 ఏళ్ల యువకులు పట్టుబడుతున్నారని చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కువ డ్రింక్ చేసి, రోడ్లపై న్యూసెన్స్ చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.