బన్సీలాల్‌పేట్ : న్యూబోయిగూడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కేఎస్ జే సొసైటీ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటిరియల్స్‌ను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జీహెచ్ఎంసీలో ఈఈగా పనిచేస్తున్న కే.వరలక్ష్మి మాట్లాడుతూ తమ సొసైటీ ద్వారా రిటైర్డ్ ఇంజనీర్ సాంబయ్య సహకారంతో బన్సీలాల్‌పేట్, బోయిగూడలలోని 90 మంది పదవ తరగతి విద్యార్థులకు మోడల్ పేపర్ సెట్లను అందించామని తెలిపారు.విద్యార్థులు కష్టపడి చదివి, మంచి మార్కులతో పాస్ అయి, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశీస్తున్నట్లు తెలిపారు.
ఆడపిల్లలకు అత్మరక్షణ విద్య కోసం తమ సొసైటీ ద్వారా కరాటేలో శిక్షణ కూడా ఇప్పిస్తున్నామని తెలిపారు. ఈ సందర్బంగా పాఠశాల హెచ్ఎం బి.శోభ విద్యార్థులు, పాఠశాల తరఫున దాతలను సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ జేఈ రుత్వింద్, పాఠశాల ఉపాధ్యాయులు ప్రభాకర్, రేణుక, పరంజ్యోతిలు పాల్గొన్నారు.
గ్రంథాలయానికి పుస్తకాల అందజేత
మంచుకొండ ఫౌండేషన్ అధ్వర్యంలో భోలక్‌పూర్‌లోని మేకలమండి ప్రాథమికోన్నత పాఠశాల గ్రంథాలయానికి 300 పుస్తకాలను విరాళంగా అందజేశారు. మంచుకొండ ఫౌండేషన్ ట్రస్టీ వరుణ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాల అభివృద్ధి కోసం తాము దత్తత తీసుకుని కావలసిన సదుపాయాలను కల్పిస్తున్నామని ఆయన తెలిపారు.
విద్యార్థులు బాగా చదువుకోవాలని ఆయన అన్నారు. పాఠశాల హెచ్ఎం కే.మల్లిఖార్జున్ రెడ్డి పాఠశాల తరఫున దాతను సన్మానించి, ధన్యవాదములు తెలిపారు.