ముషీరాబాద్ : అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా మంజురైన ఆర్థిక సహాయాన్ని(చెక్కులు) ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సోమవారం పంపిణీ చేశారు. రాంనగర్లో జరిగిన కార్యక్రమంలో 11మంది లబ్దిదారులకు చెక్కులను అందచేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ వేలాది మంది పేద, మధ్య తరగతి ప్రజలకు యేటా సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతనందించడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గంలో వందలాది మంది పేదలకు వైద్య సేవల కోసం సీఎం సహాయనిధి ద్వారా చెక్కులు అందించినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జయసింహ, ఆర్.మోజస్, ఎరం శేఖర్, ముదిగొండ మురళీ, మధు, సంపూర్ణ, కిరణ్, శోభ తదితరులు పాల్గొన్నారు.