బేగంపేట్ జూలై 19 : ఆకలితో అలమటిస్తున్న అన్నార్థులకు స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో అన్నదానం చేసి అనంతరం వస్త్రదానం చేశారు. హైదరాబాద్‌లోని రోడ్ల పక్కన ఉన్నవారికి, ఫుట్‌పాత్‌లపై జీవనం సాగిస్తున్న, అనాధలు, సంచార జాతుల, నిరాశ్రయులను గుర్తించి అన్నదానం చేసి వారికి నూతన బట్టలు అందజేశారు.
ప్రతి ఆదివారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అనాధలకు ఇలా అన్నదానం, వస్త్ర దానం చేస్తున్నామని స్కై ఫౌండేషన్ అధ్యక్షుడు సంజీవ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వైస్ ప్రసిడెంట్ పావని, రమేష్ తదితరులు పాల్గొన్నారు.