మల్కాజిగిరి జోన్ బృందం, జనవరి 2 : వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి సందర్భంగా సోమవారం మల్కాజిగిరి ని యోజకవర్గంలోని పలు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే ఆలయాలకు భక్తులు చేరుకున్నారు. ఉదయం రద్దీ ఎక్కువకావడంతో ఆలయాల ముందు బారులు తీరారు. ఉత్తర ద్వారం గుండా శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
శ్రీబాలాజీ వేంకటేశ్వరాలయానికి ప్రముఖుల తాకిడి ఎక్కువైంది. అల్వాల్, మచ్చబొల్లారం కార్పొరేటర్లు శాంతిశ్రీనివాస్, రాజ్ జితేంద్రనాథ్, మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్, మున్సిపల్ అధికారులు చిన్నారెడ్డి, బాలకృష్ణ, సాంబయ్య, పీహెచ్సీ వైద్యాధికారిణి ప్రసన్నలక్ష్మి, డీఈవో విజయకుమారి తదితరులు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. అర్చకులు వంశీపంతులు, శ్రీనివాస్ పంతులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఆలయ వంశపారంపర్య చైర్మన్ రాజా గోపాల్ సైంచర్, ఆలయ ఈవో నరేందర్, సిబ్బంది నర్సయ్య, నరేశ్, సామాజిక కార్యకర్త శివరామకృష్ణ, మాజీ ధర్మకర్త వెంకటరా మరెడ్డి, సురేందర్ రెడ్డి ఏర్పాట్లు చేశారు.
ఆనంద్‌బాగ్ చౌరస్తాలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో సోమవారం తెల్లవారు జామునుంచే వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు క్యూ కట్టారు. మల్కాజిగిరి, నేరేడ్మెట్, ఆనంద్‌బాగ్, వినాయక్‌నగర్, సైనిక్‌పురి, వాయిపురి నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబై వెంకట రమ ణా చార్యులు, అర్చకులు తులసీ వెంకట రమణా చార్యులు స్వామివార్లకు ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు దర్శనభా గ్యం కల్పించారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి రవీంద్రా రెడ్డి, క్లర్క్ సండ్ర సుధాకర్, మాజీ చైర్మన్లు ఉమేశ్ సింగ్, సంతోశ్, గణేశ్, సునీల్ రెడ్డి, హరిగౌడ్, శంకర్, తదితరులు భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు.
శామీర్‌పేట్ సమీపంలోని ఉద్దెమర్రి వేంకటేశ్వరాలయంలో స్వామివారిని అల్వాల్ కార్పొరేటర్ శాంతిశ్రీనివాస్ రెడ్డి , తదితరులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు.
డివిజన్, మారుతీనగర్‌లోని శ్రీ వేంకటేశ్వర దేవాలయంలో భక్తులు ఉత్తర ద్వారం ద్వార స్వామివారిని దర్శ నం చేసుకున్నారు. దేవాలయ అధ్యక్షుడు మోహన్‌రావు, ప్రధాన కార్యదర్శి మోహన్‌రావు గౌడ్, కాలనీ అధ్యక్షుడు ఆం జనేయులు గౌడ్, సభ్యులు ఏర్పాట్లు చేశారు.
మౌలాలి డివిజన్, భరత్‌నగర్ గణేశ్‌నగర్‌లోని పెరుమాళ్ల వీరాంజనేయస్వామి దేవాలయంలోని శ్రీతారామాలక్ష్మణ ఆలయంలో లక్ష తులసీదళాలతో అర్చన నిర్వహించారు. దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఉత్తర ద్వారం ద్వార భక్తులు దర్శనం చేసుకున్నారు. దేవాలయ చైర్మన్ కేపీ శంకర్, అధ్యక్షుడు గౌలికార్ మహేందర్, ప్రధాన కార్యదర్శి రాజేశ్‌యాదవ్, ఉపాధ్యక్షులు మాధవరెడ్డి, బుద్ధుడు, కోశాధికారి మద్ది వెంకటేశ్, ప్రధాన అర్చకులు కృష్ణమూర్తి శర్మ, సంతోశ్‌శర్మ, రాజేశ్ శర్మల ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి పూజలు నిర్వహించారు.