చర్లపల్లి /రామంతాపూర్, అక్టోబర్ 29 : ఉప్పల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేయనున్నట్లు ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఏఎస్‌రావునగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్, స్థానిక రాష్ట్ర నాయకుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు పజ్జూరి పావనీమణిపాల్‌రెడ్డి, కొత్త రామారావు, స్థానిక నాయకులతో కలిసి ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరించ డంతో పాటు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి భారీ మెజారిటీ సాధించే దిశగా నాయకులు, కార్యకర్తలు ప్రచారం నిర్వహిం చాలని ఆయన కోరారు. నియోజకవర్గ పరిధిలోని పలు కాలనీల్లోని స్థానికులు బీఆర్ఎస్ పార్టీ గెలుపు కొసం ఎకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారని, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజలను నమ్మించేందుకు అమలు కానీ హామీలను గుప్పిస్తున్నారని, వీరికి ప్రజలు తగు బుద్ది చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్ష, కార్యదర్శులు కాసం మహిపాల్‌రెడ్డి, కుమారస్వామి, నాయకులు బేతాల బాల్‌రాజు, శేర్ మణెమ్మ, మహిళ అధ్యక్షురాలు శిరీషారెడ్డి, లక్ష్మీనారా యణ, నాగేశ్వర్‌రెడ్డి, రహీం, గొలి శ్రీను, కృష్ణ, గిరి, మొగులయ్య, యాకయ్య, రాజిరెడ్డి, దుర్గ, సజ్జ రామతులసీ, తదితరులు
బీఆర్ఎస్ గెలుపు ఖాయం
తెలంగాణ రాష్ట్ర సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ రూపొందించిన ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ .. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మ రం చేస్తున్నామని చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి అన్నారు. ఆదివారం డివిజన్ పరిధిలోని సీతారాంనగర్, మారుతీనగర్, కటింగ్ కాలనీ, టీచర్స్ కాలనీ, తదితర ప్రాంతాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి మద్దతుగా స్థానిక నాయకులతో కలిసి కార్పొరేటర్ ఇంటింటా ప్రచారంను నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ.. డివిజన్లో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ప్రచారంకు మంచి ఆదరణ లభిస్తుందని, ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమన్నా రు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారంను నిర్వహిస్తున్నామని తెలిపారు. డివిజన్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థికి అత్యధిక మెజారిటీ అందించేందుకు బూత్ కమిటీలను ఏర్పాటు చేసి ప్రచారంను ముమ్మరం చేశామని, ప్రచారంకు అన్ని వర్గాల నుంచి ఆదరణ లభిస్తుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగిళ్ల బాల్‌రెడ్డి, నేమూరి మహేశ్, సప్పిడి శ్రీనివాస్‌రెడ్డి, నారెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, సారా అనిల్, జాండ్ల సత్తిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, ప్రభుగౌడ్, ఆనంద్రాజుగౌడ్, కడియాల యాదగిరి, కొమ్ము రమేశ్, సానెం రాజుగౌడ్, నర్సింహా వంశరాజ్, ధనుజంయ్యగౌడ్, కొమ్ము సురేశ్, మహిపాల్‌రెడ్డి, ముత్యాలు, పరశురాం, లక్ష్మీనారాయణ, వెంకట్‌రెడ్డి, సత్తెమ్మ, లలిత, తదితరులు పాల్గొన్నారు.
రామంతాపూర్ గాంధీనగర్‌లో..
రామంతాపూర్, అక్టోబర్ 29 :రామంతాపూర్ గాంధీనగర్ బీఆర్ఎస్ నాయకులు తిప్పని సంపత్‌కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని గెలిపించాలని ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుభాష్, ఎల్ఐసీ శ్రీనివాస్, రమేశ్, బాలాకుమార్, మైఖేల్ రాజు తదితరులు పాల్గొన్నారు.
కాప్రా డివిజన్ పరిధిలో..
కాప్రా, అక్టోబర్ 29: కాప్రాలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం రోజు, రోజుకూ ఉధృతంగా సాగుతున్నది. ఆదివారం కాప్రా డివిజన్ పరిధి ఎల్లారెడ్డిగూడలో గులాబీ దండు ప్రచారం నిర్వహించింది. గడప, గడపకూ బీఆర్ఎస్ బృందాలు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తిరుగుతూ బీఆర్ఎస్ కరపత్రాలను పంపిణీ చేస్తూ , ప్రభుత్వ పథకాలపై కాలనీవాసులకు అవగాహన కలిపిస్తూ , ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డివిజన్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నేతలు పాల్గొన్నారు.
ఉప్పల్గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయం
మల్లాపూర్, అక్టోబర్ 29 : ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని నియోజకవర్గంలో మల్లాపూర్ డివిజన్ నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కార్పొరేటర్ పన్నాల దేవేందర్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి డివిజన్ పరిధిలోని భవానీనగర్, కేఎల్రెడ్డినగర్ కాలనీలలో ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసి అభివృద్ధి , సంక్షేమ పథకాలపై ప్రజలకు తెలియజేస్తూ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.