సోమాజిగూడలోని విల్లా మేరి డిగ్రీ కళాశాల విద్యార్థులు దాండియా నృత్యాలతో శనివారం అదరగొట్టారు. కామర్స్ విభాగం ఆధ్వర్యంలో మినీ నవరాత్రి వేడుకలను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలను కళాశాల వ్యవస్థాపకురాలు, డైరెక్టర్, కరస్పాండెంట్ డాక్టర్ ఫిలోమినా, కార్యదర్శి చిన్నమ్మ, సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ రేవతీదేవీతో కలిసి ప్రారంభించారు. దాండియా నృత్యాలతో పాటు సంగీతం, స్టాండప్ కామెడీ ప్రధానంగా ఆకట్టుకున్నాయి. వందలాది మంది విద్యార్థులు లయబద్ధంగా వస్తున్న సంగీతానికి అనుగుణంగా కోలలు చేబూని వీక్షకులు అచ్చెరువొందేలా దాండియా నృత్యాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా గడిపారు. – ఖైరతాబాద్, అక్టోబర్ 7;