బంజారాహిల్స్,జనవరి 30: ప్రేమ పేరుతో యువతిని నమ్మించి లైంగికదాడికి పాల్పడిన డ్యాన్సర్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. ఉప్పల్ ప్రాంతానికి చెందిన లకావత్ రాము (24) సినిమాల్లో డ్యాన్సర్‌గా పనిచేస్తుంటాడు. రెండేళ్ల క్రితం అతనికి కృష్ణానగర్‌లో నివాసం ఉంటూ సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తున్న యువతి(21) ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయింది. కొన్నాళ్ల తర్వాత వారి పరిచయం ప్రేమగా మారింది.
పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించిన రాము.. ఆమెను గదికి తీసుకువెళ్లి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. రెండేళ్లు దాటినా పెళ్లి మాట ఎత్తకపోవడంతో ఇటీవల పలుమార్లు రామును నిలదీసింది. త్వరలో పెళ్లి చేసుకుంటానంటూ ఇటీవల ముఖం చాటేశాడు. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు రెండ్రోజుల క్రితం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం నిందితుడు రామును అదుపులోకి రిమాండ్‌కు తరలించారు.