
ఉప్పల్, ఆగస్టు 16 : హుజూరాబాద్‌లో సోమవారం జరిగిన దళిత బంధు సభకు ఉప్పల్ నుంచి టీఆర్ఎస్ నాయకులు, దళిత నేతలు భారీగా తరలివెళ్లారు. హబ్సిగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి తరలివెళ్తున్న బస్సులను ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళితబం ధు పథకం పలు రాష్ర్టాలకు ఆదర్శం కాబోతుందన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచన తో దళితుల జీవితాల్లో వెలుగునింపుతుందని అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ చిలుకానగర్ డివిజన్ అధ్యక్షుడు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, శ్రీరామ్ సత్యనారాయణ, రాంచందర్, శివకుమార్, శంకర్, మహేశ్, చైతన్య కిశోర్, రెబల్, కర్ణకృష్ణ, గుంగుర అశోక్, ముత్యంరెడ్డి, మస్క సుధాకర్, పల్లె నర్సింగ్‌రావు, కృష్ణారెడ్డి, మహేందర్, అంజి కొరపాక, తదితరులు పాల్గొన్నారు.
చర్లపల్లి, ఆగస్టు 16 : హుజూరాబాద్‌లో జరిగిన దళిత బంధు సభకు చర్లపల్లి డివిజన్ నుంచి డివిజన్ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డప్పు గిరిబాబు, టీఆర్ఎస్వీ ఉప్పల్ నియోజకవర్గం అధ్యక్షుడు జయకృష్ణ, నాయకులు సత్యనా రాయణ, కొమ్ము రమేశ్, హరినాథ్, ఎల్లయ్య, బాల్‌రాజు, ఆంజనేయులు, ముత్యాలు తదితరులు తరలివెళ్లారు.
మల్లాపూర్, ఆగస్టు 16 : మీర్పేట్ హెచ్‌బీకాలనీ డివిజన్ నుంచి హుజూరాబాద్ దళితబంధు సభకు కార్పొరేటర్ జెర్రి పోతుల ప్రభుదాస్ ఆధ్వర్యంలో తరలివెళ్తున్న బస్సును ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి జెండా ఉపి ప్రారంభించారు.