డొనేట్ ఆర్గాన్స్.. సేవ్ లైవ్స్
“ఒక ప్రాణాన్ని రక్షించడం కంటే మంచి పని మరొకటి లేదు. ప్రపంచంలోని ప్రతి మతం దానికి మద్దతు ఇస్తుంది. జీవిస్తున్నప్పుడు మరణం తర్వాత అవయదానం చేయడాన్ని ఏమతం నిషేధించలేదు. వివిధ మతాలు నిర్వహించిన సెమినార్లు అవయవదానాన్ని ఆమోదించాయి.” అని సైక్లిస్టులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు
- ఆగస్టు 13 వరకు సైక్లింగ్ కార్యక్రమాలు
- డొనేట్ ఆర్గాన్..సేవ్ లైవ్స్ నినాదంతో ప్రచారం
- మొదటి రోజు 50 మంది సైక్లిస్టులు ఆర్గాన్ డోనర్స్‌గా రిజిస్టర్
సిటీబ్యూరో, మార్చి 12 (నమస్తే తెలంగాణ): “ఒక ప్రాణాన్ని రక్షించడం కంటే మంచి పని మరొకటి లేదు. ప్రపంచంలోని ప్రతి మతం దానికి మద్దతు ఇస్తుంది. జీవిస్తున్నప్పుడు మరణం తర్వాత అవయదానం చేయడాన్ని ఏమతం నిషేధించలేదు. వివిధ మతాలు నిర్వహించిన సెమినార్లు అవయవదానాన్ని ఆమోదించాయి.” అని సైక్లిస్టులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. మోహన్స్ ఫౌండేషన్, హైదరాబాద్ సైక్లిస్టు గ్రూప్ ఆధ్వర్యంలో ఆదివారం ఖైరతాబాద్, నెక్లెస్‌రోడ్డు, ట్యాంక్‌బండ్ మీదుగా సైక్లింగ్ రైడింగ్ నిర్వహించారు. నగరంలోని సైక్లిస్టులందరూ ‘డొనేట్ ఆర్గాన్..సేవ్ లైవ్స్” అని సందేశాలతో కూడిన టీ షర్ట్లు ధరించి ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఆగస్టు 13 ప్రపంచ అవయవదానం దినోత్సవం సందర్భంగా అవయవదానంపై అవగాహన కల్పిస్తామని హెచ్‌సీజీ ఫౌండర్ నందనూరి రవీందర్ తెలిపారు. సుమారు 50 మంది సైక్లిస్టులు అవయదానం చేయడానికి తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అవయవదానంపై అవగాహన కల్పించబోతున్నట్టు ఆయన పేర్కొన్నారు.

Cycling 2
సైక్లింగ్ చేస్తూ..అవగాహన కల్పిస్తూ
హెచ్‌సీజీ ఆధ్వర్యంలో సైక్లింగ్ యాత్రలు చేపట్టారు. నగరంలోని పలు పర్యాటక ప్రాంతాల్లో పర్యటించి అవయవదానంపై అవగాహన కల్పించనున్నారు. ప్రతి ఏడాది ఆగస్టు 13న వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే(ప్రపంచ అవయవదాన దినోత్సవం) జరుపుకుంటారు. అందరిలో అవయవదానం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత సగటున ఆరేడుగురికి బతుకు ఇవ్వొచ్చు. నిర్ణీత సమయంలో కండ్లు, కిడ్నీలు, లివర్ వంటి కీలక అవయవాల్ని సేకరించి అవసరమైన వారికి ప్రసాదించవచ్చు. కండ్లు, గుండె, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, క్లోమం, పెద్ద, చిన్న పేగులు, ఎముకలు, మూలుగను వంటివి దానం చేయొచ్చు. ఈ గొప్ప కార్యం చాలా మంది ప్రాణాలను కాపాడుతుందని చాటి చెప్పడమే సైక్లిస్టుల లక్ష్యమని తెలిపారు.
అవగాహన కల్పిస్తాం
అవయవదానం సంఖ్య కూడా అవసరాలకు తగినంతగా లేదు. అయవవదాతల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది. అవయవదానంపై లేనిపోని అపోహలు, మతపరమైన నమ్మకాలు, ఆచారాల వంటి వాటి కారణంగా చాలా మంది అవయవదానానికి ముందుకు రావడం లేదు. రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది తీవ్రంగా గాయపడుతూ ఉంటారు. కొందరు మెదడు బాగా దెబ్బతిని, పూర్తిగా స్పృహ కోల్పోయి..తిరిగి కోలుకోలేని స్థితిలోకి వెళ్లిపోతుంటారు. ఇలాంటి వారిలో గుండె, కాలేయం, కిడ్నీల వంటి అవయవాలు పనిచేస్తుంటాయి. అవయవదానంపై అందరికి అవగాహన ఉండాలనే ఉద్దేశంతోనే డొనేట్ ఆర్గాన్ సేవ్ లైవ్స్ కార్యక్రమం తీసుకున్నాం.
– రవీందర్ నందనూరి, ఫౌండర్, హెచ్‌సీజీ
దాతల సంఖ్య పెరగాలి
అవయవ దానం అనేది మరో జీవితాన్ని ఇవ్వడం. దానాల్లో కెల్లా గొప్పదానం అవయవదానం. చనిపోయిన తర్వాత కూడా మరొక జీవితాన్ని నిలబెట్టే దానం అది. అయితే అవయవదానం చేయడానికి అందరికి ధైర్యంచాలదు. అందరూ అవయవదానం చేస్తామని ముందుకు రావాల్సిన అవసరం ఉంది. చాలా మంది ఇప్పటికే ఆర్గాన్ డోనర్స్‌గా ఉన్నారు. ఇంకా క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి వారి సంఖ్య మరింతగా పెరిగేలా కృషి చేస్తాం.
– రుతుంబర, సైక్లిస్టు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

