ఐటీ కారిడార్లోట్రాఫిక్కు చెక్
నిత్యం హారన్ల మోత, వాహనాల రద్దీతో గజి‘బిజీ’గా ఉండే ఐటీ కారిడార్‌లో ఉదయం, సాయంత్రం వేళల్లో వాహనదారులు ఎదురొంటున్న ట్రాఫిక్ కష్టాలకు పరిషారం చూపేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నారు.
సిటీబ్యూరో: నిత్యం హారన్ల మోత, వాహనాల రద్దీతో గజి‘బిజీ’గా ఉండే ఐటీ కారిడార్‌లో ఉదయం, సాయంత్రం వేళల్లో వాహనదారులు ఎదురొంటున్న ట్రాఫిక్ కష్టాలకు పరిషారం చూపేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నారు. హైటెక్ సిటీ, బయోడైవర్సిటీ, నాలెడ్జ్ సిటీ ప్రాంతాల్లో తరచూ ఏర్పడుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ‘వన్ వే లూప్ ’ వ్యవస్థను ప్రతిపాదిస్తున్నారు. సైబరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సహకారంతో ఈ ప్రణాళిక రూపుదిద్దుకుంటోంది. రహదారుల సహజమైన వెడల్పును వినియోగించుకుంటూ, జంక్షన్ల వద్ద వాహనాల రాకపోకలకు ఆటంకాలు కలగకుండా, నిరంతరాయంగా ట్రాఫిక్ నిర్వహణ సాఫీగా కొనసాగించడమే ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యమని సైబరాబాద్ కమిషనర్ రమేశ్ తెలిపారు. ప్రతిపాదిత వన్ వే లూప్ వ్యవస్థలో భాగంగా బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి వాహనాలరాకపోకలు ప్రారంభమయ్యేలా చర్యలు చేపడుతున్నారు. అకడి నుంచి ఐకియా రోటరీ, రహేజా మైండ్ స్పేస్ (సీ-గేట్), నాలెడ్జ్ సిటీ, డల్లాస్ సెంటర్ మీదుగా ప్రయాణించి, మై హోమ్ భూజా వద్ద కుడివైపు మలుపు తీసుకుని తిరిగి బయోడైవర్సిటీ జంక్షన్‌కు చేరుకునేలా మార్గాన్ని ప్రతిపాదించారు. ఈ మార్గంలో వాహనాలు ఒకే దిశలో నిరంతరాయంగా ప్రయాణించేలా ఏర్పాట్లు చేయనున్నారు.
క్షేత్రస్థాయిలో పరిశీలన..
ప్రతిపాదిత మార్గం సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం.రమేష్ , జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్ ) సున్‌ప్రీత్ సింగ్, సీనియర్ ట్రాఫిక్ పోలీసు అధికారులు, ఎస్సీఎస్సీ సీఈఓ నవీద్ ఖాన్ బృందం క్షేత్రస్థాయిలో ఐటీ కారిడర్‌లోని రద్దీ జంక్షన్ల వద్ద పర్యటించి, వాస్తవ పరిస్థితులను స్వయంగా అధ్యయనం చేశారు.
ట్రాఫిక్ సిమ్యులేషన్ పరీక్షలు..
ప్రణాళిక అమలుకు ముందు రాబోయే రోజుల్లో ట్రాఫిక్ సిమ్యులేషన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రతిపాదిత మార్గంలో వాహనాల వేగం, ట్రాఫిక్ సాంద్రత, రద్దీ సమయాల్లో వాహనాల ప్రవాహం తదితర అంశాలను విశ్లేషించనున్నారు. అదే సమయంలో ఐటీ కంపెనీలు, వ్యాపార సంస్థలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతర భాగస్వాములతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. వన్ వే లూప్ వ్యవస్థ అమల్లోకి వస్తే బయోడైవర్సిటీ, హైటెక్ సిటీ, నాలెడ్జ్ సిటీ పరిసరాల్లో ట్రాఫిక్ తగ్గే అవకాశముందని భావిస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో, వాహనదారులకు ఎంతమేర ఊరట కలుగుతుందో లేదో వేచి చూడాలి.
దశలవారీగా అమలు చేస్తాం: సీపీ
సైబరాబాద్ పరిధిలోని ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్య వాహనదారులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ సమస్యలకు శాశ్వత పరిషారం చూపడం కోసమే ‘వన్ వే లూప్’ వ్యవస్థను రూపొందిస్తున్నాం. ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు లేకుండా చేయడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. అన్నిశాఖల సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, తుది ప్రణాళికను ఖరారు చేసిన తర్వాతే ఈ వ్యవస్థను దశలవారీగా అమలు చేస్తాం. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా సమగ్ర ట్రాఫిక్ అడ్వైజరీలు, దారి మళ్లింపు వివరాలను అధికారికంగా వెల్లడిస్తాం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

