సిటీబ్యూరో: బాలాపూర్‌లో నివాసముండే ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు సైబర్ నేరగాళ్లు రూ. 75 లక్షలు బురిడీ కొట్టించారు. బాధితుడి వాట్సాప్‌నకు సెక్యూర్ ట్రేడ్ పేరుతో మేసేజ్ వచ్చింది. ట్రేడింగ్‌లో 30 శాతం లాభాలు సంపాదించాలంటే తాము సూచించిన యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. బాధితుడు ఆ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని మొదట రూ.50 వేలుపెట్టుబడి పెట్టగా, రూ. 2471 నష్టంతో ఆ స్టాక్‌ను విక్రయించాడు.
మరో రూ.50 వేలు పెట్టుబడితో పారాగాన్ స్టాక్స్‌ను, ఆ తరువాత అడానైంట్ స్టాక్స్‌ను కొని రూ.2 వేల చొప్పున నష్టంతో విక్రయించాడు. నికోలస్ అఫీస్ సొల్యూషన్ లిమిటెడ్ ఐపీఓ ఆఫర్లో ఉందని సూచించడంతో రూ. 8.3 లక్షలు పెట్టుబడి పెట్టడంతో 7095 షేర్స్ అలాట్ అయ్యాయి, వాటిని కొని విక్రయించడంతో రూ.14.47 లక్షల లాభం కనిపించింది. ఐపీఓ ఎన్ఏపీఎస్ గ్లోబల్ ఇండియా రూ. 35.90 లక్షల విలువైన 39891 షేర్స్‌ను కొన్నాడు.
ఐపీఓలు కొనుగోలు చేసిన షేర్లకు భారీగా విలువ పెరుగుతుండడం, స్కీన్ప్రై కోట్ల రూపాయల లాభం కనిపించింది. వాటిని విత్ డ్రా చేసుకోవాలంటే మీరు ట్యాక్స్‌లు, ఇతరాత్ర డబ్బు చెల్లించాలంటూ షరతులు విధించారు. ఇలా బాధితుడు రూ. 75,65,700 పెట్టుబడి పెట్టడంతో రూ. 1000 లాభం వచ్చింది. అయితే మొత్తం రూ. 75.65 లక్షలు నష్టపోయానంటూ బాధితుడు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.