సిటీబ్యూరో, అక్టోబర్ 8(నమస్తే తెలంగాణ): బెట్టింగ్ ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. సీపీ మహేశ్‌భగవత్ వివరాలు వెల్లడించారు. తిరుమలగిరికి చెందిన చున్నం కిరణ్ ఇంగ్లాండ్, శ్రీలంకకు వెళ్లి.. ఆన్లైన్ బెట్టింగ్‌లో ఫంటర్లకు ఎలా వల వేయాలి, ఎలా గ్యాంబ్లింగ్ చేయాలనే విషయంపై పట్టు సాధించాడు. హైదరాబాద్ కేంద్రంగా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహించడం ప్రారంభించాడు. ఏజెంట్‌గా వ్యవహరించేందుకు లండన్‌కు చెందిన బెట్‌ఫెయిర్.కామ్‌కు రూ. 20 లక్షలు చెల్లించాడు. ఇంగ్లాండ్, శ్రీలంక, గోవాకు వెళ్లి వస్తూ క్యాషినోలలో పలువురు బుకీలతో పరిచయాలు పెంచుకున్నాడు. స్నేహితుడైన సయ్యద్ అఖ్విల్ అహ్మద్‌ను సబ్ బూకీగా నియమించుకున్నాడు. సుమారు వెయ్యి మందితో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. మల్కాజిగిరి ఎస్వోటీ, నేరెడ్మెట్ పోలీసులు సంయుక్తంగా శుక్రవారం సూత్రధారి కిరణ్, అతడికి సహకరిస్తున్న అఖ్విల్ అహ్మద్‌తో పాటు సురేందర్‌రెడ్డి అనే ఫంటర్ను అరెస్ట్ చేశారు. రూ. 53 లక్షల నగదు, బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. 21.3 లక్షలను ఫ్రీజ్ చేశారు.