200 కెమెరాలు.. 2500 మంది సిబ్బంది

- మహంకాళి జాతరకు పోలీసుల మహా ఏర్పాట్లు
- అన్ని శాఖల అధికారులతో సమావేశం
బేగంపేట్ జూలై 20: సికింద్రాబాద్‌లో జూలై 25, 26వ తేదీల్లో జరిగే ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరను భక్తులు సమన్వయం, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ కోరారు. భక్తులు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. జాతరను పురస్కరించుకొని మంగళవారం మహంకాళి దేవాలయం ప్రాంగణంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి పోలీసు అధికారులు సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీపీ అంజనీకుమార్ ఆలయం పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అక్కడి భద్రత ఏర్పాట్లను ఉత్తర మండలం డీసీపీ కల్మేశ్వర్ సింగన్వార్ను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ మాట్లాడుతూ.. కరోనా పూర్తిగా పోలేదన్నారు. కొవిడ్ వ్యాక్సినేషన్ నడుస్తున్నప్పటికీ భక్తులంతా తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ ఉత్సవాల్లో పాల్గొనాలని సూచించారు. 2500 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహిళా భక్తులను దృష్టిలో పెట్టుకొని.. మహిళా సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. బోనాలతో వచ్చే మహిళలకు రెండు క్యూ లైన్లు ఉంటాయని పేర్కొన్నారు.
దేవాలయం పరిసర ప్రాంతాల్లో ఉండే సీసీ కెమెరాలతో పాటు అదనంగా పోలీసు ఐటీ సెల్ ద్వారా 200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు అర్థమయ్యేలా పార్కింగ్ సూచికలు, రూట్ మ్యాపులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీఐపీ పాస్‌ల జారీలో సమయం కేటాయించి వివిధ దశల్లో అనుమతి ఉంటుందని చెప్పారు. అనంతరం ఉత్తర మండలం జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడు పారిశుధ్య సిబ్బంది విధులు నిర్వహిస్తుంటారని, ఆలయ పరిసరాల్లో 50 మంది సిబ్బంది మూడు షిఫ్టుల్లో పారిశుధ్య పనులతో పాటు హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రోడ్లు మరమ్మతులు కూడా చేపడుతున్నామని, మరికొన్ని వీధి దీపాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర అదనపు కమిషనర్లు చౌహాన్, షీఖా గోయల్, అనిల్‌కుమార్, డీసీపీలు రాధాకృష్ణ, డీఎం అండ్ హెచ్‌వో వెంకటి, ఆలయ ఈవో మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

