తాగి వేధిస్తున్నందుకు.. 225 రోజులు జైలు
మద్యం మత్తులో తల్లి, చెల్లి, భార్యా పిల్లలను హింసిస్తున్న ఒక వ్యక్తికి న్యాయస్థానం ఏడున్నర నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం.. నేరేడ్మెట్ ప్రాంతంలో నివాసముండే తుపటి సాయిబాబా కూలీ. ఈనెల 11వ తేదీ రాత్రి సంజీవయ్యనగర్‌లో నివాసముండే తల్లి ఇంటికి వెళ్లాడు
సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ): మద్యం మత్తులో తల్లి, చెల్లి, భార్యా పిల్లలను హింసిస్తున్న ఒక వ్యక్తికి న్యాయస్థానం ఏడున్నర నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం.. నేరేడ్మెట్ ప్రాంతంలో నివాసముండే తుపటి సాయిబాబా కూలీ. ఈనెల 11వ తేదీ రాత్రి సంజీవయ్యనగర్‌లో నివాసముండే తల్లి ఇంటికి వెళ్లాడు. ఇంటి తలుపులు సుత్తితో పగలగొట్టి లోనికి ప్రవేశించాడు. ఇంట్లో ఉన్న తల్లి, చెల్లెలను హింసించాడు. దాంతో పాటు భార్యా పిల్లలను కూడా తీవ్రంగా హింసించాడు.
అతడి వేధింపులు తట్టుకోలేక తల్లి బాలనర్సమ్మ మారేడ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. 15వ మేజిస్ట్రేట్ కోర్టు నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష, రూ. 1350 జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో 45 రోజులు అదనంగా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది న్యాయస్థానం తీర్పు చెప్పింది. జరిమానా చెల్లించకపోవడంతో నిందితుడికి 225 రోజుల జైలు శిక్ష ఖరారయ్యింది. నిందితుడి గతంలో కూడా జైలుకు వెళ్లాడని, అయినా అతడి ప్రవర్తలో మార్పు రాలేదని పోలీసులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- court
- family
- Harassment
- MAN
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

