బంజారాహిల్స్,మే 5: వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలోని సింగాడకుంటలో మ్యాన్‌హోల్ పొంగిపొర్లుతోందంటూ స్థానికులు ఫిర్యాదు చేయడంతో కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి గురువారం పర్యటించారు. జలమండలి సిబ్బందిని పిలిపించి సమస్యలకు కారణాలు గుర్తించడంతో పాటు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని కార్పొరేటర్ ఆదేశించారు. వర్షాకాలం రాకముందే డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ శివకుమార్, ఏఈ ఆనంద్‌తో పాటు స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
నాలా పూడికతీత పనులు పరిశీలన
గోల్నాక, మే 5: బాగ్‌అంబర్‌పేటలో ఓపెన్ నాలా, వరద నీటి పైపులైన్లలో పూడిక తీత పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. గురువారం స్థానిక కార్పొరేటర్ బి.పద్మావెంకట్‌రెడ్డి శివం రోడ్డులో వరద నీటి నాలాలో జరుగుతున్న పూడికతీత పనులను ఆమె పరిశీలించారు. నాలాల్లో తీసిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని ఆమె అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈ సుధాకర్, ఏఈ ప్రేరణ, వర్క్ఇన్స్పెక్టర్ రవితో పాటు స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు.