అబిడ్స్, ఫిబ్రవరి 25 : పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించేందుకు బీఆర్ఎస్ నాయకుడు ఆశీష్‌కుమార్ యాదవ్ ఉచిత మెగా వైద్య ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం ప్రశంసనీయమని నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పేర్కొన్నారు. గోడేఖీ ఖబర్లోని డబుల్ బెడ్రూం సముదాయంలో ఆశీష్‌కుమార్ ఆయూష్ కేంద్రం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని శనివారం ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ శిబిరం నిర్వాహకులు, బీఆర్ఎస్ నాయకుడు ఆశీష్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. హ్యాండ్ ఆఫ్ హోప్ సంస్థ సహకారంతో గోషామహల్ సెగ్మెంట్లో వందకు పైగా శిబిరాలను నిర్వహించేందుకు నిర్ణయించగా, ఇందులో తొలి శిబిరాన్ని గోడేఖీఖబర్ డబుల్బెడ్రూం ప్రాంగణంలో ప్రారంభించడం జరిగిందన్నారు.
ఈ శిబిరంలో 15 రకాల వైద్య సేవలతో పాటు మహిళలకు గైనిక్ చికిత్సలు, ఉచితంగా 55 రకాల మందులను పంపిణీ చేయడం జరిగిందని వివరించారు. ప్రతి నెలా రెండవ, నాల్గవ శనివారం ఐదు వందల నుంచి వెయ్యి మందికి సేవలు అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. తొలిరోజు జరిగిన 800లకు పైగా రాగా వారికి అవసరమైన ఈసీజీ, బ్లడ్, షుగర్, సీబీపీ, సీయూఈ, ఎక్సరేతో పాటు పలు పరీక్షలను ఉచితంగా నిర్వహించడంతో పాటు వెంటనే వారికి పరీక్షల ఫలితాల రిపోర్టులను అందజేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముఖేశ్‌సింగ్, బీఆర్ఎస్ నాయకులు ఆల పురుషోత్తంరావు, శాంతిదేవీ, ధన్‌రాజ్, ఆనంద్‌సింగ్ పాల్గొన్నారు. అంతకు ముందు గోడేఖీఖబర్ చౌరస్తా వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి వైద్య శిబిరం వరకు భారీ ఎత్తున ఊరేగింపుగా మాగంటి గోపీనాథ్‌కు కార్యకర్తలు స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఖడ్గం బహూకరించి సన్మానించారు.