మన్సూరాబాద్, ఆగస్టు 29 : కరోనా సమయంలో ప్రజలకు అందించిన సేవలకు ఎల్బీనగర్ ట్రాఫిక్ అదనపు సీఐ అంజపల్లి నాగమల్లు కరోనా ఫ్రంట్‌లైన్ వారియర్ అవార్డును అందుకున్నారు. నగరంలో శనివారం రాత్రి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఒక టీవీ చానెల్ ఈ అవార్డును అందజేసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, హైదరాబాద్ సీపీ అంజనీకుమార్, సినీనటుడు శ్రీకాంత్ పాల్గొని అంజపల్లి నాగమల్లుకు కరోనా ఫ్రంట్‌లైన్ వారియర్ అవార్డును అందజేశారు. అనంతరం కరోనా మహమ్మారిపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వలస కార్మికులకు భోజనం, నిత్యావసరాలు అందించడంతోపాటు సేవలు చేసిన అంజపల్లి నాగమల్లును వారు అభినందించారు.