చల్లని పానీయాలకు నగరవాసులు దూరం

- వెంటాడుతున్న కరోనా భయం
- ప్రస్తుతం గోరు వెచ్చటి నీటికే జై
- ఇంట్లోనే పండ్ల రసాలు తయారీ
- బయట ఫుడ్ అంటే భయపడుతున్న వైనం
వేసవి వచ్చిందంటే చాలు నగరవాసులు చల్లటి ప్రదేశాల్లో వాలిపోతారు. శీతల పానీయాలు, కూల్‌డ్రింక్స్‌తో సేద తీరుతుంటారు. నగరంలో ఎక్కడ చూసినా జ్యూస్బండ్లు, షర్బత్, చెరుకు, నిమ్మరసం బండ్లు కనిపించేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కొవిడ్ పంజా విసురుతుండడంతో నగరవాసులు చల్లటి పానీయాలకు దూరంగా ఉంటున్నారు. వైరస్‌ను ఎదుర్కోవాలంటే గోరు వెచ్చటి నీరు కీలకపాత్ర పోషిస్తుండటంతో రోజుకు మూడు నాలుగుసాైర్లెన హాట్‌వాటర్, టీ,కాఫీ లాంటివి తీసుకుంటున్నారు.
కూల్‌కు దూరం
ఎండాకాలం వచ్చిందంటే నగరంలో విచ్చలవిడిగా జ్యూస్బండ్లు, శీతల పానీయాల దుకాణాలు వెలిసేవి. మార్చి, ఏప్రిల్, మే మాసాలు వారికి మెండుగా ఉపాధి దొరికేది. కానీ గత ఏడాది నుంచి వారికి వేసవి కలిసి రావడం లేదు. కొవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో నగరవాసులు బయట శీతల పానీయాలు తాగడానికి భయపడుతున్నారు. కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్‌ల జోలికి పోవడం లేదు. వాటితో జలుబు లాంటి ఇబ్బంది తలెత్తితే ప్రమాదమని భావిస్తున్నారు. బయట శుభ్రతపరంగా జాగ్రత్తలు తీసుకుంటారో లేదోననే మీమాంసతో ప్రజలు బయట ఆహారానికి దూరంగా ఉంటున్నారు. భానుడు భగభగమంటున్నా చాయ్లకే జై కొడుతున్నారు. వీలైనంత వరకు గోరు వెచ్చటి నీటిని తాగేందుకు మక్కువ చూపిస్తున్నారు.
బయటకు వెళితే..
- కొబ్బరినీళ్లు, గ్లూకోస్ వాటర్ తాగాలి.
- ఇంట్లో ఎలక్ట్రోరల్ పౌడర్ లేదా ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచుకోవాలి. బయటకు వెళ్లినప్పుడు ఇవి వెంట ఉండేలా చూసుకోవాలి. శరీరం డీహైడ్రేషన్ గురికాకుండా చూసుకోవాలి.
- ఎండాకాలంలో వ్యాయామం అతిగా చేయకూడదు. మధ్యాహ్నం ఎక్సర్సైజ్ వద్దు.
- జలుబు, దగ్గు ఉన్నప్పుడు గొంతులో ఉన్న కపాన్ని కరిగించి వేడి పానీయాలు దోహదం చేస్తాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- cool drinks
- Soft drinks
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

