సిటీబ్యూరో, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): మహానగరానికి మణిహారమైన ఔటర్ రింగు రోడ్డు పచ్చందాలతో అలరారుతున్నది. గ్రేటర్ చుట్టూ 158 కి.మీ పొడవునా ఉన్న ఓఆర్ఆర్పై 63 లక్షలకు పైగా మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాటికి నిరంతరం నీటి సరఫరా అందిస్తున్నారు. ఈ విషయాలను రాష్ట్ర పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ ట్వీట్ చేశారు.