కండ్లన్నీ కార్లోస్‌పైనే..
ఈ ఏడాది ఆఖరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్ పోరుకు తెరలేచింది. ఆదివారం మొదలయ్యే ఈ మెగా టోర్నీలో సత్తా చాటేందుకు మేటి ఆటగాళ్లంతా సిద్ధమయ్యారు. వరల్డ్ నంబర్ వన్ యానిక్ సినర్ మోకాలి గాయం తగ్గకపోవడంతో టోర్నీ నుంచి తప్పుకోగా, డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) నాలుగు నెలల సుదీర్ఘ గాయం విరామం తర్వాత ఈ టోర్నీతోనే రీఎంట్రీ ఇస్తున్నాడు. దాంతో అందరి దృష్టి అతనిపై ఉండనుంది.
- నేటి నుంచే యూఎస్ ఓపెన్
న్యూయార్క్: ఈ ఏడాది ఆఖరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్ పోరుకు తెరలేచింది. ఆదివారం మొదలయ్యే ఈ మెగా టోర్నీలో సత్తా చాటేందుకు మేటి ఆటగాళ్లంతా సిద్ధమయ్యారు. వరల్డ్ నంబర్ వన్ యానిక్ సినర్ మోకాలి గాయం తగ్గకపోవడంతో టోర్నీ నుంచి తప్పుకోగా, డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) నాలుగు నెలల సుదీర్ఘ గాయం విరామం తర్వాత ఈ టోర్నీతోనే రీఎంట్రీ ఇస్తున్నాడు. దాంతో అందరి దృష్టి అతనిపై ఉండనుంది.
ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచినప్పటికీ, గత నాలుగు నెలలుగా మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం అతనికి పెద్ద సవాలుగా మారనుంది. మరోవైపు 24 గ్రాండ్‌స్లామ్స్ విన్నర్, 39 ఏండ్ల నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) వయసు ప్రభావంతో పాటు సిన్సినాటిలో వేడిని తట్టుకోలేక తొలి రౌండ్లోనే ఓడాడు. సినర్ గైర్హాజరీ, అల్కరాజ్, జొకో పూర్తి స్థాయిలో సిద్ధంగా లేకపోవడంతో ఫ్రెంచ్ ఓపెన్ విజేత అలెగ్జాండర్ జ్వెరెవ్ టాప్ సీడ్‌గా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుండగా.. సిన్సినాటి టైటిల్ గెలిచిన ఆర్థర్ ఫిల్స్, మాజీ చాంపియన్ మెద్వెదెవ్, డి మినార్ కూడా ట్రోఫీ వేటలో ముందంజలో ఉన్నారు.
మహిళల విభాగంలో యూఎస్ ఓపెన్ హ్యాట్రిక్ టైటిల్‌పై కన్నేసిన బెలారస్ స్టార్, వరల్డ్ నంబర్ వన్ అరీనా సబలెంక తీవ్ర ఒత్తిడిలో ఉంది. వింబుల్డన్ నాలుగో రౌండ్లోనే నిష్క్రమించిన ఆమె, ఆ తర్వాత ఆడిన రెండు హార్డ్ కోర్ట్ టోర్నీల్లోనూ ఆరంభ రౌండ్లలోనే వెనుదిరిగింది. ఈ వరస వైఫల్యాల వల్ల ఆమె టాప్ ర్యాంక్ ప్రమాదంలో పడింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంప్ రిబకినా, ప్రపంచ మూడో ర్యాంకర్ పెగులా, కోకో గాఫ్ అగ్రస్థానంతో పాటు ట్రోఫీకి గురిపెట్టారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shah Rukh Khan | షారుఖ్ఖాన్అరుదైన ఘనత.. ది 100 గ్రేటెస్ట్ మూవీ స్టార్స్ ఆఫ్ ఆల్‌టైమ్ జాబితాలో చోటు
KTR | రోత భాష ఏందీ రేవంత్.. కరువు, కన్నీళ్లతో బాధపడుతుంటే చిల్లర మాటలతో చిందులా??.. కేటీఆర్ ఫైర్
Sajjanar | పోస్టింగ్ ఎక్కడ ఇచ్చినా తగ్గేది లేదు.. సజ్జనార్ కీలక వ్యాఖ్యలు!
మాల వేసుకుని చెప్తున్న.. కాంగ్రెస్ మళ్లా రాదు!.. సీఎం కరప్షన్‌తో తీవ్రనష్టం.. రేవంత్‌పై ఎమ్మెల్యే రాజగోపాల్ ఫైర్
Harish Rao | మాటల్లో వజన్ లేదు.. చేతల్లో విజన్ లేదు.. సిద్దిపేటలో రేవంత్‌రెడ్డి చిల్లర ప్రసంగంపై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

