రేపటి కోసం నేడే సిద్ధం!
రోజులన్నీ అనుకున్నట్లే సాగవు. కోరుకున్నట్లుగా ముగియవు. కొన్ని రోజులు మనసుకు తృప్తినిస్తాయి. మరికొన్ని రోజులు అసంతృప్తితో గడుస్తాయి. అసంపూర్తిగా మిగిలిన పనులు, విరామం తీసుకోలేని ఆలోచనలతో ముగుస్తాయి. వాటి గురించే ఆలోచిస్తూ పడుకుంటే.. అవి మరుసటి రోజు పైనా ప్రభావం చూపుతాయి.
రోజులన్నీ అనుకున్నట్లే సాగవు. కోరుకున్నట్లుగా ముగియవు. కొన్ని రోజులు మనసుకు తృప్తినిస్తాయి. మరికొన్ని రోజులు అసంతృప్తితో గడుస్తాయి. అసంపూర్తిగా మిగిలిన పనులు, విరామం తీసుకోలేని ఆలోచనలతో ముగుస్తాయి. వాటి గురించే ఆలోచిస్తూ పడుకుంటే.. అవి మరుసటి రోజు పైనా ప్రభావం చూపుతాయి. అందుకే, వాటిని మనసులోంచి తొలగించుకోండి. ఇందుకోసం కొన్ని చిన్నచిన్న అలవాట్లతో.. సాయంత్రాన్ని అద్భుతంగా మలుచుకోండి. రేపటి కోసం మానసిక ప్రశాంతతను పెంచుకోండి.
కృతజ్ఞత అంటే.. జీవితాన్ని మార్చేసే పెద్దపెద్ద విషయాల్లోనే కాదు. చిన్నచిన్న సందర్భాల్లోనూ కృతజ్ఞతగా ఉండటం నేర్చుకోండి. ఇంటికి రాగానే చేతికి అందిన ఒక కప్పు కాఫీ, అనుకోకుండా వినిపించిన మీ ఫేవరేట్ సాంగ్.. ఇలా మీ మనసుకు నచ్చే చిన్నచిన్న మంచి విషయాలను గమనించండి. ‘ఈ రోజులో కాస్త మెరుగ్గా జరిగిన విషయం ఏంటి?’ అని ఒకసారి మీకు మీరే ప్రశ్నించుకోండి. వచ్చిన సమాధానంతో సంతృప్తి పడండి. ఇలా ప్రతిరోజూ మీ మనసుకు శిక్షణ ఇస్తే.. మీ దినచర్యలపై మీ దృష్టికోణం క్రమంగా మారుతుంది. ఇది సమస్యలను పూర్తిగా తుడిచిపెట్టకపోవచ్చు.. కానీ, మీ జీవితమంతా ఆ సమస్యలే నిండిపోకుండా ఆపుతుంది.
చాలామంది తమకు తెలియకుండానే మనసులోని ఆందోళనలన్నిటినీ పడకటింట్లోకి మోసుకెళ్తుంటారు. గరంగరంగా ముగిసిన ఆఫీస్ మీటింగ్, మర్చిపోయిన పని, మనసును బాధపెట్టిన సంభాషణలు.. వీటన్నిటినీ మరుసటి రోజుకు బదిలీ చేస్తారు. అలా కాకుండా.. ఇంటికి రాగానే జేబుల్లోని వస్తువులను బయట పెట్టినట్లు.. మనసును కూడా ఖాళీ చేయండి. మీ మనసులోని బాధలు, భావాలను ఓ కాగితంపై రాయండి. మీ ఆలోచనలకు వేరే దగ్గర స్థలం దొరికినప్పుడు.. మీ మెదడు రాత్రంతా వాటిని మోయాల్సిన అవసరం ఉండదు.
రోజులో ఎక్కువ సమయం స్క్రీన్లలోనే తల దూర్చేస్తాం. దీనివల్ల పడమర దిక్కున మలిపొద్దు అలికే అందాలను ఆస్వాదించలేం. అందుకే, కాసేపు బాల్కనీలోకి, డాబాపైకి.. కనీసం కిటికీ దగ్గరికైనా వెళ్లండి. నీలం నుంచి నారింజ.. ఊదా రంగులోకి మారే ఆకాశాన్ని గమనించండి. మనం ఏమీ చేయకపోయినా.. మన మనసులోని ఆవేదనను తగ్గించే శక్తి ప్రకృతికి ఉంది. రోజంతా ఎంత గందరగోళంగా గడిచినా.. ఈ చిన్న అలవాటు వల్ల రోజు ప్రశాంతంగా ముగుస్తుంది. మనసు స్థిమితపడుతుంది.
మనసు మాత్రమే ఒత్తిడిని మోయదు. పని ఒత్తిడి, ఆందోళన మన శరీరంపైనా ప్రభావం చూపుతుంది. దాని నుంచి బయట పడేందుకు.. చిన్నచిన్న స్ట్రెచింగ్స్ చేయండి. ధ్యానాన్ని అలవాటుగా మార్చుకోండి. కాసేపు ఫోన్ పక్కన పెట్టి ప్రశాంతంగా కూర్చోండి. శరీరానికి ఉపశమనం కావాలంటే.. కఠినమైన వ్యాయామాలే అక్కర్లేదు. సున్నితమైన కదలికలు కూడా.. విశ్రాంతి కోసం నాడీ వ్యవస్థకు సంకేతం ఇస్తాయి.
నిద్రపోయే ముందు మనం దేనినైతే చూస్తామో; ఏదైతే వింటామో.. మరుసటి రోజు ఉదయం మనసు అదే విషయాన్ని ముందుగా గుర్తుచేసుకుంటుంది. కాబట్టి, పడుకునే ముందు మనసుకు తృప్తికలిగించే పనులు చేయండి. నచ్చిన పుస్తకంలో కొన్ని పేజీలు చదవండి. ఆహ్లాదకరమైన సంగీతం వినండి. పడక గదిలో సువాసనలు వెదజల్లే కొవ్వొత్తిని వెలిగించండి. గోరువెచ్చని హెర్బల్ టీ తాగండి. సోషల్ మీడియా స్క్రోలింగ్ను పక్కన పెట్టేసి.. కాసేపు నిశ్శబ్దంగా కూర్చోండి. ప్రశాంతత అనేది అనుకోకుండా రాదు. మనం ఉద్దేశపూర్వకంగా సృష్టించుకునే నిశ్శబ్ద క్షణాల్లోనే అది వికసిస్తుందని గుర్తించుకోండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

