సిటీబ్యూరో, మార్చి 14 (నమస్తే తెలంగాణ): హోలీ పండుగ సందర్భంగా నగరంలో పలు చోట్ల ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి గంజాయితో తయారు చేసిన 100 కుల్ఫీ ఐస్‌క్రీమ్‌లు, 32 గాంజా గోలీలు, 108 బర్ఫీ స్వీట్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు.
ఎస్టీఎఫ్ ఈఎస్ నంద్యాల అంజిరెడ్డి కథనం ప్రకారం.. ధూల్‌పేటకు చెందిన సత్యనారాయణ హోలీ పండుగ సందర్భంగా కుల్ఫీ ఐస్‌క్రీమ్‌లో గంజాయి కలిపి విక్రయిస్తున్నాడు. ఎస్టీఎఫ్ బృందా లు లోయర్ ధూల్‌పేటలోని సత్యనారాయణ నివాసంపై దాడులు జరిపి అరెస్టు చేశాయి. మరో కేసులో గంజాయితో త యారు చేసిన మత్తు గోలీలు విక్రయిస్తున్న బల్దేవ్సింగ్ను అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి 32 గంజాయి గోలీలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే గంజాయితో తయా రు చేసిన బర్ఫీ మిఠాయిలు విక్రయిస్తున్న తోట గంగాధర్‌ను పట్టుకున్నారు.108 మత్తు మిఠాయి బాక్సులను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.