LPG Gas | పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అప్రమత్తమైన జనాలు కొన్ని రోజులుగా గ్యాస్ బుకింగ్ చేసుకొని.. కొత్త గ్యాస్ సిలిండర్ తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వినియోగదారులు వేకువ జామునే ఏజెన్సీల వద్దకు వెళ్లి లైన్లో నిలబడుతున్నారు. ఇదిలా ఉంటే పౌరసరఫరాల శాఖ అధికారులు గ్యాస్ కొరత ఏమీ లేదంటూ ఏజెన్సీల ద్వారా గ్యాస్ సాఫీగా సాగుతుంది అని చెబుతున్నారు.. కానీ క్షేత్రస్థాయిలో గ్యాస్ కొరత తీవ్రంగానే ఉంది. ఇందుకు ఈ ఫోటోలే నిదర్శనం.
కంటోన్మెంట్ మనోవికాస్ నగర్‌లోని ఇండియన్ గ్యాస్ గోడౌన్ వద్ద జనాలు గ్యాస్ కోసం బారులు తీరారు. ఓ వృద్ధుడు ఇంటి వద్ద నుంచి కుర్చీ తెచ్చుకొని మరీ క్యూ లైన్లో మండుటెండలో గ్యాస్ బుకింగ్ కోసం కూర్చుని ఉండటం కూడా చూడొచ్చు. గ్యాస్ బుకింగ్ కోసం గంటల తరబడి వేచి ఉంటున్నామని సర్వర్ కూడా సరిగ్గా పనిచేయడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. గ్యాస్ బుక్ చేసిన తర్వాత ఇంటికి తెచ్చి ఇవ్వడం లేదని.. చాలా రకాలుగా గ్యాస్ వినియోగదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇక్కడ క్యూ కట్టిన జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






US-Iran ceasefire | ఇరాన్-అమెరికా కాల్పుల విరమణపై స్పందించిన ఇండియా.. ఏం చెప్పిందంటే
ACB Raid | రూ.15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంఈవో, స్కూల్ అసిస్టెంట్
Allu arjun | ఐకాన్ స్టార్‌కు గీతా ఆర్ట్స్ స్పెషల్ గిఫ్ట్.. అదిరిపోయే బర్త్‌డే మ్యాషప్ వీడియో